Prabhas: 200కోట్లతో ప్రభాస్‌ కొత్తిళ్లు.. ఇంద్రభవనం తలపించేలా?

By Aithagoni Raju  |  First Published Dec 10, 2021, 4:29 PM IST

ఎయిర్‌పోర్ట్ కి దగ్గరగా ఉండటం, ట్రాఫిక్‌ లేకుండా ఉండటం, మంచి ప్రశాంతవంతమైన వాతావరణం ఉండేలా చూసుకుని అక్కడ ల్యాండ్‌ తీసుకున్నాడట ప్రభాస్‌. అయితే అందులోనే కొత్తిళ్లు నిర్మించుకోబోతున్నారట.


ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. `బాహుబలి` తర్వాత ఆయన రేంజ్‌ మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఐదు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. అందులో `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ కొత్త ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. ఆయన త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆయన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోబోతున్నారట. హైదరాబాద్‌లోని నానక్‌ రామగూడ సినీ విలేజ్‌లో ప్రభాస్‌ పెద్ద విల్లాని నిర్మించుకోబోతున్నాడని సమాచారం. 

నానక్‌రామగూడలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకి దగ్గరలో దాదాపు రూ. 120కోట్లతో ప్రభాస్‌ ఇటీవల రెండు ఎకరాలు కొనుగోలు చేశాడట. ఎయిర్‌పోర్ట్ కి దగ్గరగా ఉండటం, ట్రాఫిక్‌ లేకుండా ఉండటం, మంచి ప్రశాంతవంతమైన వాతావరణం ఉండేలా చూసుకుని అక్కడ ల్యాండ్‌ తీసుకున్నాడట prabhas. అయితే అందులోనే కొత్తిళ్లు నిర్మించుకోబోతున్నారట. గెస్ట్ హౌజ్‌ తరహాలో, అత్యాధునిక సౌకర్యాలతో కోటలాంటి హాలిడే హోమ్‌ని ప్రభాస్ నిర్మించుకోవాలనుకుంటున్నారట. ఇదొక సింపుల్‌గా చెప్పాలంటే ఓ ఇంద్రభవనంలా ఉండబోతుందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. 

Latest Videos

నానక్‌ రామ్‌గూడ సమీపంలో సెలబ్రిటీలు నివసిస్తున్నారు. మున్ముందు ఆ ఏరియాని సినిమా సెలబ్రిటీలు తమకి హాట్‌ స్పాట్‌గా మార్చుకోబోతున్నారు. షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు వీలుగా, స్టూడియోలకు దగ్గరగా, వెళ్లేందుకు అనుకూలంగా ఉండటంతో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నారట. అందులో భాగంగా ప్రభాస్‌ ఆ ఏరియాని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సుమారు రెండు వందల కోట్లతో తన కొత్తింటిని నిర్మించుకోవాలని ప్లాన్‌ చేశారట. ఆ ఇంట్లోనే తాను ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. మ్యారేజ్‌ చేసుకుని ఆ ఇంట్లోనే సెటిల్‌ అవ్వాలనుకుంటున్నారట. 

ఇదిలా ఉంటే ఇప్పటికే జుబ్లీహిల్స్ లో ప్రభాస్‌కి ఓ ఇళ్లు ఉంది. అయితే అ ఇళ్లుకి అభిమానుల తాకిడి ఎక్కువైపోతుందట. అది తనకు చాలా డిస్టర్బ్ గా ఉందని, ప్రభాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు ప్రభాస్‌కి ముంబయిలోనూ ఓ ఇళ్లు ఉంది. ప్రస్తుతం ఆయన హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. ముంబయిలో షూటింగ్‌ల సమయంలో తన ఇంటిని వాడుకుంటున్నారు ప్రభాస్‌. ప్రభాస్‌ ప్రస్తుతం నటించిన Radheshyam జనవరి 14న సంక్రాంతి కానుకగా పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

వీటితోపాటు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మితమవుతుంది. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. మరోవైపు తెలుగు, హిందీలో `ఆదిపురుష్‌` సినిమాలో నటించారు. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కానుంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌తో చేయబోతున్న సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో `స్పిరిట్‌` చిత్రం చేస్తున్నారు ప్రభాస్‌.

also read: RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి షాకిచ్చిన అభిమానులు.. మీడియాకి రాజమౌళి క్షమాపణలు..

click me!