
ప్రభాస్ నిన్నటి రోజంతా ఫోటో షూట్ లో గడిపినట్లు సమాచారం. అయితే వరస ప్రాజెక్టులతో ఉన్న ఆయన ఇప్పుడు కొత్తగా ఫొటో షూట్ జరపటమేంటి..ఎవరి సినిమా కోసం అంటే పీపుల్స్ మీడియా ఆఫీస్ లో ఆ ఫొటో షూట్ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఈ ఫొటో షూట్ ఖచ్చితంగా దర్శకుడు మారుతి తో చేస్తున్న లో బడ్జెట్ చిత్రం కోసమే అంటున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రాబోతోందని అందుకే ఈ ఫొటో షూట్ చేసారని చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సూపర్ నాచురల్ హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కాగా ఈ సినిమా ధర్డ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో నాలుగు రోజులు క్రితం ప్రారంభం అయిన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు మారుతి చిత్రీకరించనున్నట్లు తెలిసింది.
ఇక ప్రభాస్ సినిమా కోసం భారీ వ్యయంతో ఓ పాతకాలం నాటి థియేటర్ సెట్‌ను చిత్ర యూనిట్ వేసినట్లు వినికిడి. ఈ సెట్‌లోనే ధర్డ్ షెడ్యూల్ షూటింగ్ జరుగనుందని చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది. ప్రభాస్, మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే పేరును పరీశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం టైటిల్‌తో పాటు షూటింగ్, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. లిమిటెడ్ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది. అలాగే రామాయణ గాథ ఆధారంగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.