పూజా తీరుతో విసిగిపోయిన ప్రభాస్.. విబేధాలతో రొమాన్స్ పండించలేకున్న జంట,ఆపై యూనిట్ క్లారిటీ!

Published : Sep 23, 2021, 08:44 AM ISTUpdated : Sep 23, 2021, 08:55 AM IST
పూజా తీరుతో విసిగిపోయిన ప్రభాస్.. విబేధాలతో రొమాన్స్ పండించలేకున్న జంట,ఆపై యూనిట్ క్లారిటీ!

సారాంశం

పూజా(Pooja hegde) షూటింగ్ లేట్ గా రావడం  పట్ల ప్రభాస్(Prabhas) అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరి మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో రొమాంటిక్ సన్నివేశాలు సరిగా రావడం లేదనేది టాక్.


గత రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. రాధే శ్యామ్ జంట ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విబేధాలు తలెత్తాయట. పూజా హెగ్డే తీరు నచ్చని ప్రభాస్ ఆమెతో సఖ్యతగా ఉండడం లేదనేది సదరు వార్తల సారాంశం. స్టార్ హీరోయిన్ గా కోట్ల సంపాదనతో,  క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా హెగ్డే ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని కొందరు అంటున్నారు. ఆమె షూటింగ్ కి సమయానికి రాకుండా, ప్రతిరోజూ ఆలస్యం చేస్తున్నారట. 


పూజా(Pooja hegde) ఇలా షూటింగ్ లేట్ గా రావడం  పట్ల ప్రభాస్(Prabhas) అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరి మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో రొమాంటిక్ సన్నివేశాలు సరిగా రావడం లేదనేది టాక్. అయితే ఈ వివాదంపై రాధే శ్యామ్ చిత్ర యూనిట్ స్పందించారు. మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలతో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. 
పూజా హెగ్డే చాలా నిబద్ధత గల యాక్ట్రెస్, ఆమె షూటింగ్ కి టైం కి వస్తారు. 

ఇక ప్రభాస్, పూజా మధ్య ఏ విధమైన విబేధాలు లేవు. ఆఫ్ స్క్రీన్ లో వాళ్ల హెల్తీ రిలేషన్ కారణంగా ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చక్కగా పండుతుంది, అని చిత్ర యూనిట్ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ మధ్య ఎమ్మెల్యే, నటి రోజా భర్త సెల్వమణి పూజా హెగ్డే పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా 12మంది సహాయకులను సెట్ కి తీసుకువస్తూ, నిర్మాతలకు అధిక వ్యయానికి కారణం అవుతుందని ఆరోపించారు. దీనితో రాధే శ్యామ్ విషయంలో పూజా హెగ్డే పై వచ్చిన వార్తలలో నిజం ఉండే అవకాశం లేకపోలేదనిపిస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?
Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. ఫస్ట్ టైమ్ ఓపెన్‌ అయిన రష్మిక మందన్నా