తాతగారి సెంటిమెంట్...అందుకే ఎన్టీఆర్ అంత ఖర్చు పెట్టారు

By Surya PrakashFirst Published Sep 23, 2021, 7:59 AM IST
Highlights

 ఎన్టీఆర్ కు 9 అనే నెంబర్ ఆయనకు ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్‌ ఖాతాలో కూడా ఎన్టీఆర్‌ @tarak9999 కనిపిస్తుంది.  ఈ నంబర్ వెనుక అసలు కారణం ఏమిటంటే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నంబర్ 9999. 

చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రెటీలు, వీఐపీలు తమ తమ వాహనాలకి ఒకే విధమైన ఫ్యాన్సీ నెంబర్లను పెట్టుకుంటుంటారు. ఇందుకోసం భాగానే ఖర్చు చేస్తుంటారు. ఈ
లిస్ట్ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉన్నారు. రీసెంట్ గా  అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు ఆయన. అయితే ఈ కారు కొనేందుకు తారక్ కోట్లు ఖర్చు పెడితే, ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు ఖర్చు చేశాడు.

 17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబరు దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.  అన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఇదే హయ్యెస్టు బిడ్. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆర్టీయే అధికారులకు మొత్తం 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయి. దాంతో  వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇక ఎన్టీఆర్‌  దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ కు 9 అనే నెంబర్ ఆయనకు ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్‌ ఖాతాలో కూడా ఎన్టీఆర్‌ @tarak9999 కనిపిస్తుంది.  ఈ నంబర్ వెనుక అసలు కారణం ఏమిటంటే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నంబర్ 9999. ‘తన తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ కారు నెంబర్‌ 9999 అని, తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ ఓ సందర్భాల్లో చెప్పుకొచ్చాడు’.

జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి.  నెంబర్ల వారీగా వేలం.. పలికిన ధర.. దక్కించుకున్న యజమాని వివరాలు.. 
నెంబర్: TS 09 FT టీ 0001 .. బిడ్ మొత్తం.. రూ.7,01,000 యజమాని పేరు: లహరి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్

నెంబర్:  TS 09 FT 0009 బిడ్ మొత్తం: రూ 3,75,999.. యజమాని పేరు: రతన్ నల్లా 
 

click me!