ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచే వార్త

Published : May 30, 2019, 03:39 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచే వార్త

సారాంశం

తమ హీరో ఓ పెద్ద డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. 

తమ హీరో ఓ పెద్ద డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఓ రకంగా వారిలో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాంటిది ఇండియా మొత్తం గర్వించదగ్గ డైరక్టర్, టెక్నాలిజీ మిగతావారికన్నా ఓ అడుగు ముందుంటే దర్శకుడు డైరక్షన్ లో తమ హీరో సినిమా ఉందంటే మాటలా..సోషల్ మీడియా హోరెత్తిపోదు. గత రెండు రోజులుగా అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు అందులో నిజం లేదని తెలిసి నీరు కారిపోయారు. వివరాల్లోకి వెళితే..

రీసెంట్ గా  ‘2.0’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు శంకర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తమిళ మీడియా సైతం ఈ వార్తకు ఓ రేంజిలో ప్రయారిటీ ఇచ్చింది. అయితే అందులో నిజం లేదని తెలిసిపోయింది.  ఆ రూమ‌ర్ల‌పై శంక‌ర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

టీమ్ చెప్పేదాని ప్రకారం...ప్ర‌స్తుతం శంక‌ర్ లేటెస్ట్ వెంచర్ భార‌తీయుడు-2 త‌ప్ప మ‌రో కొత్త ప్రాజెక్ట్ చేప‌ట్ట‌లేద‌ని…ఆయ‌న దృష్టంతా భార‌తీయుడు-2పైనే ఉంద‌ని తెలిపారు. మరో విషయం  ఇప్ప‌టివ‌ర‌కూ శంక‌ర్ ఏ తెలుగు హీరోతో సినిమా చేయ‌లేదు.

ఇక  ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ మళ్ళీ సినిమాల వైపు మొగ్గు చూపుతూ ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ని వేగంగా  పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో  ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని  అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..