Prabhas London house: లండన్ లో లగ్జరీ ఇల్లు తీసుకుంటున్న ప్రభాస్.. అంత డబ్బు దారపోస్తున్నాడా ?

Published : Feb 26, 2024, 11:50 AM IST
Prabhas London house: లండన్ లో లగ్జరీ ఇల్లు తీసుకుంటున్న ప్రభాస్.. అంత డబ్బు దారపోస్తున్నాడా ?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రంతో బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నెమ్మదిగా ప్రచార జోరు మొదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. కల్కి తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్  రానుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రంతో బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నెమ్మదిగా ప్రచార జోరు మొదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. కల్కి తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్  రానుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి దర్శకత్వంలో చిత్రాలకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. 

ప్రభాస్ చివరగా సలార్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. కల్కి 2898 AD చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. ఇటీవల ప్రభాస్ ఎక్కువగా విదేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కాలికి సర్జరీ కూడా విదేశాల్లోనే జరిగింది. తాజాగా ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. 

ప్రభాస్ లండన్ లో ఒక విలాసవంతమైన ఇంటిని అద్దెకి తీసుకుంటున్నాడట. అక్కడికి వెళ్ళినప్పుడు ఉండేందుకు సౌకర్యవంతంగా ఓ ఇంటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటికి ప్రభాస్ అద్దెకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అద్దె ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆ ఇంటికి అద్దె నెలకు సుమారు 60 లక్షలు అట. 

దీనితో నెటిజన్లు ఫాన్స్ అంతా అంత రెంట్ పెట్టే బదులు సొంత ఇల్లే కొనుక్కోవచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది బాలీవుడ్ ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉంటారు. అక్కడ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా టాలీవుడ్ స్టార్స్ కి కూడా విదేశాలపై మోజు పెరుగుతోంది. మహేష్ బాబు ఆల్రెడీ దుబాయ్ లో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు