యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం

Published : Feb 13, 2017, 08:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం

సారాంశం

లాంఛనంగా ప్రారంభమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సుజీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ తదుపరి చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్ పై భారీ బజట్ తో రూపొందనున్న ప్రభాస్ మూవీ

భారీ విజయం సాధించిన బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కొత్త చిత్రం ఇవాళే ప్రారంభమైంది. సుజీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బేనర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ 19వప చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ గతంలో మిర్చి లాంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించారు.

 

ప్రభాస్ తాజా చిత్రానికి శంకర్ ఎసాన్ లాయ్ లు సంగీతం అందిస్తుండగా మేధీ సినిమాటోగ్రఫీ చేయనున్నారు. ఇక రోబో, బాహుబలి లాంటి చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సబూ సైరిల్ ఈ చిత్రానికీ పనిచేయనున్నారు. 

 

తెలుగు , తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ముహూర్తం సన్నివేశానికి రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు హ‌జ‌ర‌య్యారు. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు.  త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి