చిరంజీవి సెట్ లో ప్రభాస్ షూటింగ్

Published : Feb 20, 2023, 04:59 PM IST
 చిరంజీవి సెట్ లో ప్రభాస్ షూటింగ్

సారాంశం

ఈ సినిమా షెడ్యూల్‌ నిన్నటి నుంచి అంటే 19 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు మారుతి చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలిసింది.


ఓ పెద్ద సినిమా కోసం భారీ సెట్ వేసినప్పుడు అది పూర్తయ్యాక..దాన్ని పడగొట్టేయకుండా వేరే రకంగా వాడుతూంటారు. కొద్ది పాటి మార్పులు, చేర్పులతో వేరే సినిమాలు తెరకెక్కిస్తూంటారు. గతంలో  బాహుబలి వంటి సినిమాల సెట్స్ ని అలా వాడారు. ఇది సిని పరిశ్రమలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. అలాగే ఇప్పుడు చిరంజీవి డిజాస్టర్ చిత్రం ఆచార్య సెట్ లో ప్రబాస్ సినిమా షూటింగ్ పెట్టినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ కామెడీ క‌థాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో డిసెంబ‌ర్ నుంచి ప్రారంభం అయ్యి అప్పుడప్పుడూ జరుగుతున్నట్లు స‌మాచారం. ప్రభాస్ కు గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ నిన్నటి నుంచి అంటే 19 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు మారుతి చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలిసింది.

అలాగే ఈ షెడ్యూల్ ని చిరంజీవి ఆచార్య కోసం వేసిన పాద ఘట్టం సెట్ ను మోడిఫై చేసి సెట్ చేసినట్లు సమాచారం. ప్లాష్ బ్యాక్ సీన్స్ ఇక్కడ షూట్ చేయబోతున్నారు. అలాగే  ప్ర‌భాస్ సినిమా కోసం భారీ వ్య‌యంతో ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ను చిత్ర యూనిట్ వేసిన‌ట్లు వినికిడి. ఈ సెట్‌లోనే కొంత షెడ్యూల్ షూటింగ్ జ‌రిపారని చెబుతున్నారు. 

ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ప్ర‌భాస్‌, మారుతి సినిమాకు రాజా డీల‌క్స్ అనే పేరును ప‌రీశీల‌న‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం టైటిల్‌తో పాటు షూటింగ్‌, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు.మీడియం బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

  ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ సినిమా రూపొందుతోంది. అలాగే రామాయ‌ణ గాథ ఆధారంగా ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా వ‌చ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?