NBK108లో తారకరత్న చేయాల్సింది.. అంతలోనే ఇలా.. అనిల్ రావిపూడి ఎమోషనల్ కామెంట్స్!

Published : Feb 20, 2023, 04:01 PM ISTUpdated : Feb 20, 2023, 04:05 PM IST
NBK108లో తారకరత్న చేయాల్సింది.. అంతలోనే ఇలా.. అనిల్ రావిపూడి ఎమోషనల్ కామెంట్స్!

సారాంశం

నందమూరి  తారకరత్న మరణం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి భావోద్వేగమయ్యారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలతో నివాళి అర్పించిన డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.   

నందమూరి  తారకరత్న (Tarakaratna) మరణవార్తను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే నందమూరి కుటుబ సభ్యులు కులిమిపోతున్నారు. శనివారం రాత్రి మరణిండంతో బాడీని హైదరాబాద్ కు తరలించారు. సందర్శకుల చివరి చూపునకు ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు తారకరత్న పార్థివ  దేహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా తారకరత్న మరణం పట్ల చింతించారు. న్యూస్ తెలిసిన వెంటనే ట్వీటర్ ద్వారా సంతాపం ప్రకటించిన డైరెక్టర్.. కొద్దిసేపటి కింద తారకరత్న పార్థివ దేహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘తారకరత్న మరణం చాలా బాధాకరం. ఆయన ఆస్ప్రతిలో చేరినప్పటి నుంచి ఆయన  తిరిగి ఇంటికి రావాలని 20 నుంచి నుంచి ఎంతగానో ప్రార్థించాం. పర్సనల్ గానూ రెండుసార్లు ఆయన్ని కలిశాను. చాలా మంచి మనిషి. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

అలాగే బాలయ్య నాకు ఫోన్ చేసిన తారకరత్నను NBK108లో తీసుకుందామన్నారు. నేను తీసుకుందామనే అన్నాను. మంచి రోల్ కోసం చూస్తున్న సమయంలోనే సడెన్ గా ఇలా జరిగింది. మోస్ట్ షాకింగ్ న్యూస్.’ అంటూ ఎమోషన్ అయ్యారు. ఇక తారకరత్నకూ బాలయ్య కలిసి సినిమా చేయాలని ఓ కోరిక ఉండేది. అది తీరకుండానే కన్నుమూశారు. మరికొద్ది రోజులైతే కనీసం అనిల్ - బాలయ్య చిత్రంతోనైనా కాస్తా సంతోషించే వారేమో అంటూ అభిమానులు చింతిస్తున్నారు. 

తారకరత్న మరణంతో ఎన్బీకే108 నెక్ట్స్ షూటింగ్  షెడ్యూల్ ను వాయిదా వేసినట్టు యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 23 నుంచి షూట్ ప్రారంభం కావాల్సి ఉంది.  ప్రస్తుతం తారకరత్న దశదిన కర్మ వరకు అన్నీ కార్యక్రమాలు బాలయ్యనే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని, అందుకే షూటింగ్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కాసేపటి కిందనే తారకరత్న అంతిమ యాత్ర ప్రారంభమైంది. పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు ర్యాలీగా తరలిస్తున్నారు. కార్యక్రమంలో పలువురు సినీ,  రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే