ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్డ్.. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేసిన ప్రభాస్!

Published : Sep 27, 2021, 09:59 AM IST
ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్డ్.. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేసిన ప్రభాస్!

సారాంశం

ప్రభాస్(Prabhas) నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్(adhipurush) నిర్మాతలు సైతం విడుదల తేదీ లాక్ చేశారు. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని ఆగష్టు 11న ఆదిపురుష్ విడుదల చేయనున్నారు.


2022 ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఇయర్ కానుంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ఇక ప్రభాస్ తో కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సమ్మర్ సీజన్లో విడుదల చేయనున్నారు. 


ఇక ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ నిర్మాతలు సైతం విడుదల తేదీ లాక్ చేశారు. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని ఆగష్టు 11న ఆదిపురుష్ విడుదల చేయనున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన చేశారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రోల్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.ప్రస్తుతం ఆదిపురుష్ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయడం జరిగింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..