స్టార్ ప్రొడ్యూసర్ ఆర్ ఆర్ వెంకట్ అకాల మరణం... హీరో రవితేజ దిగ్బ్రాంతి!

Published : Sep 27, 2021, 09:25 AM ISTUpdated : Sep 27, 2021, 09:29 AM IST
స్టార్ ప్రొడ్యూసర్ ఆర్ ఆర్ వెంకట్ అకాల మరణం... హీరో రవితేజ దిగ్బ్రాంతి!

సారాంశం

ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అకాల మరణం పొందారు.కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.  ఆర్ ఆర్ వెంకట్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. 

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అకాల మరణం పొందారు.కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.  ఆర్ ఆర్ వెంకట్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 


దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ దుర్ఘటనపై స్పందించారు. నా మొదటి చిత్రం డాన్ శీను నిర్మాత ఆర్ ఆర్ ఆర్ వెంకట్. సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్న నిర్మాత. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి. రెస్ట్ ఇన్ పీస్ ఆర్ ఆర్ ఆర్ వెంకట్ గారు... అంటూ ట్వీట్ చేశారు. 

నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ మరణవార్త కలచి వేసింది . నేను పని చేసిన నిర్మాతల్లో బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... అంటూ రవితేజ ట్వీట్ చేశారు. 

కెరీర్ లో కిక్, బిజినెస్ మాన్, ప్రేమ కావాలి, పూల రంగడు, మిరపకాయ్ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్ ఆర్ వెంకట్, ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చిత్రం తెరకెక్కించారు. పైసా, లవ్లీ, ఆటోనగర్ సూర్య తో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు ఆయన నిర్మాణంలో తెరకెక్కాయి. డివోర్స్ ఇన్విటేషన్ అనే ఇంగ్లీష్ చిత్రంతో పాటు ఏక్ హసీనా థి, జేమ్స్ అనే హిందీ చిత్రాలకు ఆర్ ఆర్ ఆర్ వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు. 
 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..