
కోలీవుడ్ స్టార్ విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా తెరకెక్కుతుంది ది గోట్. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. విజయ్ కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ప్రభుదేవా, ప్రశాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. ది గోట్ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో విజయ్ రెండు పాటలు పాడారట. ఈ విషయాన్ని యువన్ శంకర్ రాజా స్వయంగా వెల్లడించారు.
విజయ్ సర్ మొదటిసారి ది గోట్ చిత్రంలోని రెండు పాటలు పాడారని యువన్ శంకర్ రాజా అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక హీరోలు సాంగ్స్ పాడటం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్ తో పాటు మరికొందరు స్టార్స్ తమ చిత్రాల్లో, ఇతర హీరోల చిత్రాల్లో పాటలు పాడారు.
ఇక ది గోట్ విజయ్ చివరి చిత్రం కావడం విశేషం. పొలిటికల్ పార్టీ స్థాపించిన విజయ్ రాజకీయంగా బిజీ కానున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తమిళగ వెట్రి కజగం అనే పార్టీ స్థాపించారు. తన అభిమానులతో విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు.
విజయ్ సినిమాలు మానేయడం ఆయన ఫ్యాన్స్ కి ఒకింత అంశమే. అయితే విజయ్ సీఎం కావాలని కూడా వారు కోరుకుంటున్నారు. విజయ్ గత చిత్రం లియో రూ. 600 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది.