ఆదిపురుష్‌ నుంచి ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఏడువేల ఏళ్ళ క్రితం ఏం జరిగింది?

Published : Sep 02, 2020, 08:47 PM IST
ఆదిపురుష్‌ నుంచి ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఏడువేల ఏళ్ళ క్రితం ఏం జరిగింది?

సారాంశం

ప్రభాస్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో పైన పేర్కొన్నట్టు ఏడువేల ఏళ్ళ క్రితం ఓ తెలివైన రాక్షసుడు ఉండేవాడని పేర్కొన్నారు. ఇందులో  రేపు(గురువారం) ఉదయం 7గంటల 11 నిమిషాలకు మరో అప్‌డేట్‌ని పంచుకోనున్నారు.

`ఏడు వేల ఏళ్ళ క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు` అని అంటున్నారు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ఆయన హీరోగా బాలీవుడ్‌లో `ఆదిపురుష్‌` చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. 

ఇది పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో రాముడుగా ప్రభాస్‌ నటించనున్నారు. సీత పాత్ర కోసం అన్వేషణ జరుగుతుంది. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని హిందీతోపాటు తెలుగు, ఇతర సౌత్‌ భాషల్లో రూపొందించనున్నారు. ఇటీవల ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్‌.

 ఈ మేరకు ప్రభాస్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో పైన పేర్కొన్నట్టు ఏడువేల ఏళ్ళ క్రితం ఓ తెలివైన రాక్షసుడు ఉండేవాడని పేర్కొన్నారు. ఇందులో  రేపు(గురువారం) ఉదయం 7గంటల 11 నిమిషాలకు మరో అప్‌డేట్‌ని పంచుకోనున్నారు. బహుశా ఇందులో విలన్‌ పాత్రని రివీల్‌ చేసే అవకాశం ఉందని టాక్‌. దీంతో ప్రభాస్‌ సర్‌ ప్రైజ్‌ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ `రాధే శ్యామ్‌` చిత్రంలో పూజా హెగ్డే తో కలిసి నటిస్తున్నారు. దీనికి వంశీ, ప్రమోద్‌తోపాటు కృష్ణంరాజు నిర్మాత. మరోవైపు `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చిత్రానికి ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.     
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?