అప్పుడు ఒక్క ఇంట్లో..ఇప్పుడు లక్షల కుటుంబాల్లో.. మెగాబ్రదర్‌ ట్వీట్‌

Published : Sep 02, 2020, 06:01 PM IST
అప్పుడు ఒక్క ఇంట్లో..ఇప్పుడు లక్షల కుటుంబాల్లో.. మెగాబ్రదర్‌ ట్వీట్‌

సారాంశం

బుధవారం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అన్ని విషయం తెలిసిందే. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నాగబాబు కాస్త లేట్‌గా ట్విట్టర్‌ ద్వారా పవన్‌కి పుట్టిన రోజు విశెష్‌ తెలిపారు. 

పవన్‌ పుట్టినప్పుడు వారి ఒక్కరి ఇంట్లోనే సంతోషం ఉందని, ఇప్పుడు లక్షల ఇండ్లకు ఆ సంతోషం వ్యాపించిందని అంటున్నారు నాగబాబు. బుధవారం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అన్ని విషయం తెలిసిందే. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నాగబాబు కాస్త లేట్‌గా ట్విట్టర్‌ ద్వారా పవన్‌కి పుట్టిన రోజు విశెష్‌ తెలిపారు. 

ఆయన స్పందిస్తూ, `నువ్వు పుట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు మా ఇంటిని సంతోషంతో నింపేశావు. ఇప్పుడు నీ పుట్టిన రోజునాడు ఆ సంతోషాన్ని లక్షల కుటుంబాలకు వ్యాపించింది. హ్యాపీ బర్త్ డే తమ్ముడు` అని నాగబాబు ట్వీట్‌ చేశాడు. `తమ్ముడు` అనేది తెలుగులో మెన్షన్‌ చేయడం విశేషం. పవన్‌ `తమ్ముడు` సినిమా చేసిన విషయం తెలిసిందే. 

పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఎలాంటి వివాదమైన, సమస్య ఉన్నా మొదట మెగాబ్రదర్‌ నాగబాబు స్పందిస్తారు. పవన్‌ స్థాపించిన `జనసేన` పార్టీలోనూ నాగబాబు క్రియాశీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. అంతేకాదు పవన్‌ నటించిన చాలా సినిమాల్లో నాగబాబు కీలక పాత్రలు పోషించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Atlee: రెండోసారి తండ్రి అయిన అట్లీ, మహాలక్ష్మి వచ్చింది.. `రాకా` సెట్‌లో డబుల్ సెలబ్రేషన్‌
700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?