డార్లింగ్ ప్రభాస్ Prabhas ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ‘భక్త కన్నప్ప’ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజా అప్డేట్ అందింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ Salaar తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ దుమ్ములేపుతోంది. దీంతో సినిమా పేరు మారుమోగుతోంది. ప్రస్తుతం డార్లింగ్ భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ.. రాజాసాబ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి షెడ్యూల్స్ లోనూ డార్లింగ్ కాస్తా సమయం ఇచ్చి మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ Baktha Kannappa సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజా అప్డేట్ అందింది.
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్టే ‘భక్త కన్నప్ప’. గతుడాది ఆగస్టులో ఈ పాన్ ఇండియా మూవీ శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా మొదలైంది. షూటింగ్ న్యూజిలాండ్ లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal), తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వంతు వచ్చింది. దీంతో షూటింగ్ కోసం రెబల్ స్టార్ డేట్స్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో 17 నుంచి 19 వరకు ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ లో హాజరు కానున్నారని తెలుస్తోంది.
‘భక్తకన్నప్ప’ చిత్రాన్ని కూడా పూర్తిగా న్యూజిలాండ్ లోనే షూట్ చేయనున్నారు. విష్ణు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో నెక్ట్స్ అప్డేట్స్ పై ఆసక్తి నెలకొంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండటం విశేషం. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ పరమేశ్వరుడి పాత్రలో నటిస్తున్న తెలుస్తోంది.
దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటోంది. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నయనతార, అనుష్క కనిపించబోతున్నట్టు టాక్. ఈ భారీ ప్రాజెక్ట్ కు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తుండటం ఆసక్తికరంగా మారింది.