బిగ్ బాస్ షో పై దాడులు చేద్దాం, ధ్వంసం చేద్దాం... సిపిఐ నారాయణ పిలుపు!

By Sambi Reddy  |  First Published Jan 28, 2024, 7:08 PM IST

సీనియర్ రాజకీయవేత్త సిపిఐ నారాయణ చాలా కాలంగా బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. 
 



బిగ్ బాస్ రియాలిటీ షోకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. హిందీలో మొదలైన ఈ షో అనంతరం ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. తెలుగులో 2017 నుండి ప్రసారం అవుతుంది. ఎన్టీఆర్, నాని వరుసగా మొదటి రెండు సీజన్స్ కి హోస్టింగ్ చేశారు. సీజన్ 3 నుండి నాగార్జున ఆ బాధ్యలు తీసుకున్నారు. బిగ్ బాస్ షోపై సాంప్రదాయ వాదుల్లో వ్యతిరేకత ఉంది. ఇది సమాజానికి చెడు చేసే షో అని వారి ఆరోపణ. 

సీనియర్ రాజకీయవేత్త సిపిఐ నారాయణ బిగ్ బాస్ షో రద్దు చేయాలంటూ తన గళం పలుమార్లు వినిపించాడు. హోస్ట్ నాగార్జునను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ గా ఆయన అభివర్ణించడం కొసమెరుపు. సీజన్ 7 ముగిసి నెల రోజులు దాటిపోతుండగా మరోసారి సిపిఐ నారాయణ మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నారాయణ.. బిగ్ బాస్ షో ని రద్దు చేయాలి, ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చారు. 

Latest Videos

కళ అనేది వ్యాపారాత్మకంగా మారిపోయింది. కార్పొరేట్ కబంధ హస్తాల్లో కూరుకుపోయింది.  ఈ సమాజాన్ని బిగ్ బాస్ షో చెడు మార్గంలో నడిచేలా చేస్తుంది. బిగ్ బాస్ షో ఒక చీడ పురుగు. యువతను తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే కళాకారులందరూ ఏకతాటిపైకి రావాలి. అస్లీలత లేని కార్యక్రమాలు రూపొందేలా చూడాలి. 

మనం అందరం కలిసి రాబోయే బిగ్ బాస్ సీజన్ ని అడ్డుకుందాము. బిగ్ బాస్ షోని ధ్వంసం చేద్దాము. దానిని ఆపించడమే, రద్దు చేసేలా చేయడమే మన కర్తవ్యం. నాతోపాటు అందరూ కలిసి రండి అని ఆవేశపూరిత ప్రసంగం ఇచ్చాడు. సమయం సందర్భం లేకుండా సిపిఐ నారాయణ బిగ్ బాస్ షోపై విరుచుకుపడిన తీరుకు జనాలు అవాక్కు అయ్యారు. మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి... 

click me!