RRR Movie Update : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి క్రేజీ అప్డేట్.. మార్చి 14న ‘ఎత్తరజెండా’.. అప్పటి నుంచి రచ్చరచ్చే..

Published : Mar 10, 2022, 06:44 PM IST
RRR Movie Update : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి క్రేజీ అప్డేట్.. మార్చి 14న ‘ఎత్తరజెండా’.. అప్పటి నుంచి రచ్చరచ్చే..

సారాంశం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఫ్యాన్స్, ఆడియెన్స్ కోసం క్రేజీ అప్డేట్ అందించారు.

దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది రోజులుగా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అభిమానులు సినిమాకు సంబంధించిన సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ అభిమానులు, ప్రేక్షకుల కోసం క్రేజీ అప్డేట్ అందించారు. కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇఫ్పటికే 15 రోజుల గ్యాప్ ఉండటంతో తమ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు, మరింత  పబ్లిసిటీ కోసం మేకర్స్ సిద్ధమయ్యారు. 

తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ నుంచి ‘ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్ అంథిమ్’ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. మార్చి 14న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. సమాచారం అందిస్తూ మూవీ నుంచి ‘ఎత్తర జెండా’ అంథిమ్ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ పిడికిలి, నడుము బింగించి కనిపిస్తారు. వీరి వెనుక సైన్యాన్ని కూడా చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో తుపాకులు, బుల్లెట్స్, జన సమూహాన్ని చూపించే ఈ పోస్టర్ మరింత ఆకట్టుకుంటోంది. జన చైతన్యానికి సంబంధించినదిగా ఉండనున్నదీ సాంగ్.

ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితంలోని అజ్ఞాత కాలాన్ని దర్శకుడు రాజమౌళి కల్పితంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt)తో పాటు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్స్, గ్లిమ్స్  సినిమాపై హద్దుల్లేని అంచనాలను పెంచింది.  మార్చి 25న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ మార్చి 14 నుంచి రెగ్యూలర్ గా రానున్నాయి. ఇప్పటికే యూఎస్ఏలోనూ అభిమానులు సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ను షురూ చేయనున్నారు. 

 

 మూడున్నరేండ్లుగా జక్కన్న నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఇంతకు ముందే ప్రమోషన్లు అన్ని భాషల్లో దాదాపు పూర్తయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియోస్. సాంగ్స్.. పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మున్ముందు ఇదే హవా కొనసాగనుందని తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌