Mahesh Action Séances: మహేష్ బాబు యాక్షన్ ట్రీట్... తగ్గేది లేదంటున్న సూపర్ స్టార్.

Published : Mar 10, 2022, 06:21 PM IST
Mahesh Action Séances: మహేష్ బాబు యాక్షన్ ట్రీట్... తగ్గేది లేదంటున్న సూపర్ స్టార్.

సారాంశం

ఎప్పుడో అయిపోవాల్సింది మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా షూటింగ్. కాని రకరకాల కారణాల వల్ల డిలై అవుతూ వస్తోంది. ఇక సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్  చేస్తున్నాడు మహేష్. యాక్షన్ కోసం రంగంలోకి దిగాడు. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా  పరశురామ్ డైరెక్షన్ లో సర్కారువారి పాట సినిమా రూపొందుతోంది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథతో యాక్షన్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ మూవీగా తెరకెక్కుతోంది సర్కారువారి పాట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంతోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింట్  ఫేమస్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు  హై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. 

కొందరు  ఫైటర్స్ తో పాటు సూపర్ స్టార్  పై యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల పాటు ఈ షూటింగ్  షెడ్యూల్ నడవనుందని సమాచారం.  మహేశ్ బాబు మార్కు కామెడీతో పాటు యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమా ఇది. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో లో ఇప్పటికే చాలా వరకూ మేజర్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఫారెన్ లో తెరకెక్కిన ఫైట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని సమాచారం. 

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోవల్సి ఉంది. అయితే మధ్యలో కరోనా ఇబ్బందులతో పాటు సూపర్ స్టార్ కాలికి సర్జరీ అయ్యి దుబాయ్ లో రెస్ట్ తీసుకున్నారు. ఆతరువాత షూటింగ్ కు రెడీ అవుతున్న టైమ్ లో మహేష్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇక ఆయన క్యారంటైన్ నడుస్తుండగానే మహేష్ బాబు అన్న రమేష్ బాబు మరణించారు. ఇవ్నీ దాటుకుని.. కోలుకుని మళ్ళీ షూటింగ్ రీ స్టాట్ చేసే సరికి బాగా డిలై అయ్యింది.  

రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కళావతికి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కళావతి పాట  కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది.  సర్కారు వారి పాట సినిమాలో సూపర్ స్టార్  మహేశ్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించింది. 

వీరితో పాటు స్టార్ కాస్ట్ ఇందులో సందడి చేయబోతున్నారు.ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోను మే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు 14 రీల్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్