రామ్ లీల మైదానంలో రావణ దహనం చేసిన ప్రభాస్..!

Published : Oct 05, 2022, 11:03 PM IST
రామ్ లీల మైదానంలో రావణ దహనం చేసిన ప్రభాస్..!

సారాంశం

ప్రభాస్ కి అరుదైన గౌరవం దక్కింది. దసరా పర్వదినం సందర్భంగా రామ్ లీలా మైదానం లో రావణ దహనం చేశారు. విల్లు ఎక్కిపెట్టి రావణాసురుడిని ప్రభాస్ భస్మం చేశాడు.   


ఏళ్లుగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా పండగ వేళ రావణుడి బొమ్మ దహనం చేయడం ఆచారంగా ఉంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఏడాది ప్రభాస్ కి రావణ దహనం చేసే అవకాశం దక్కింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ తో పాటు ప్రభాస్ దీనికి హాజరయ్యాడు. భారీ రావణ విగ్రహాన్ని ఆయన దహనం చేశారు. ప్రభాస్ ఎక్కుపెట్టి బాణం విడువడగా రావణుడు భస్మం అయ్యాడు. 

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ రామ జన్మభూమి అయోధ్యలో విడుదల చేశారు. ఆదిపురుష్ టీజర్ కి భారీ ఆదరణ దక్కించుకుంది. రికార్డు వ్యూస్ ఆదిపురుష్ టీజర్ నమోదు చేసింది. దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతి సనన్ సీత పాత్ర చేశారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. 

2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆదిపురుష్ విడుదల కానుంది. ఆదిపురుష్ పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్ టీజర్ వివాదాస్పదమైంది.రాముడితో పాటు రావణుడి గెటప్స్ విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా రావణుడి లుక్ అల్లావుద్దీన్ ఖిల్జీని తలపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ రామాయణం చదవలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు ఆదిపురుష్ చిత్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?