ఆచార్య దరిదాపుల్లో లేని గాడ్ ఫాదర్... చిరు గత నాలుగు చిత్రాలలో ఇదే లోయస్ట్!

By Sambi ReddyFirst Published Oct 6, 2022, 5:17 PM IST
Highlights

గాడ్ ఫాదర్ టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మాత్రం షాక్ఇచ్చింది. చిరంజీవి కెరీర్ డిజాస్టర్ ఆచార్య ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సగం కూడా రాలేదు. 
 

అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైంది. మూవీ విజయం పై పూర్తి నమ్మకంతో ఉన్న టీం ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. చిరంజీవి నమ్మకాన్ని నిజం చేస్తూ గాడ్ ఫాదర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి మేనరిజం, రోల్ సినిమాలో అదిరిపోయాయని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇంకేముంది గాడ్ ఫాదర్ కలెక్టన్స్ మోత మోగించడం ఖాయం అనుకున్నారు. తీరా కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. 

అసలు టాక్ కి కలెక్షన్స్ కి మాత్రం సంబంధం లేదు. చిరంజీవి కెరీర్ బెస్ట్ కొడతాడు అంటుకుంటే లోయస్ట్ నమోదు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ మొదటిరోజు కేవలం రూ. 13 కోట్ల షేర్ రాబట్టింది. ఇది ఆచార్య ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సగం కూడా కాదు. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తో నడిచిన ఆచార్య ఓపెనింగ్ డే ఏపీ/తెలంగాణా లలో రూ. 29.5 కోట్ల షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ షేర్ కూడా ఇంత లేదు. మేకర్స్ అధికారికంగా రూ. 38 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు రిపోర్ట్ చేశారు. 

చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత చేసిన నాలుగు చిత్రాల్లో గాడ్ ఫాదర్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఎప్పుడో 2017 లో విడుదలైన ఖైదీ 150 రూ. 23.5 ఓపెనింగ్ డే షేర్ రాబట్టడం విశేషం. చిరంజీవి కెరీర్ లో సైరా అత్యధిక ఓపెనింగ్ డే రికార్డు కలిగి ఉంది. ఈ చిత్రం రూ. 38.75 కోట్ల షేర్ అందుకుంది. పండగ రోజు విడుదలైనప్పటికీ ఇంత పూర్ కలెక్షన్స్ కి కారణం ఏమిటో అర్థం కాలేదు. ఇక గాడ్ ఫాదర్ చిత్రానికి లాంగ్ వీకెండ్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు గమనిస్తున్నాయి. 
 

click me!