నిద్ర లే రౌత్‌.. `ఆదిపురుష్‌` డైరెక్టర్‌ని ఆడుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్..

Published : Mar 19, 2023, 10:51 PM IST
నిద్ర లే రౌత్‌.. `ఆదిపురుష్‌` డైరెక్టర్‌ని ఆడుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్..

సారాంశం

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. ఈ సినిమా విడుల తేది దగ్గరపడుతుంది. కానీ  ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. మైథలాజికల్‌ కథాంశంతో రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా ఆయన సరసన సీత పాత్రలో కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. తెలుగు, హిందీలో ఏక కాలంలో రూపొందించిన ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమా, దాదాపు పదికిపైగా భాషల్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. టీ సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. మరో మూడు నెలల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని జూన్‌ 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ చిత్రం గతేడాది ఆగస్ట్ లోనే విడుదల కావాల్సింది. కానీ సీజీ వర్క్ కారణంగా, మరోవైపు `లాల్‌ సింగ్‌ చద్దా` కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత జనవరి 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విడుదలైన టీజర్‌లో సీజీ వర్క్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రోల్స్ కి గురయ్యింది. వీఎఫ్‌ ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయని, బొమ్మల మూవీలా ఉందంటూ ఆడుకున్నారు నెటిజన్లు. 

దీంతో వీఎఫ్‌ఎక్స్ వర్క్ లో పర్‌ ఫెక్షన్‌ కోసం, చాలా వరకు మళ్లీ విజువల్‌ ఎఫెక్ట్స్ చేయడం కోసం టైమ్ తీసుకున్నారు దర్శకుడు ఓం రౌత్‌. సినిమాని ఈ జూన్‌ 16కి వాయిదా వేశారు. ఇక సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలు కూడా లేదు. అయినా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు ఇమ్మిడియెట్‌ గా రాబోతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్‌` మొదటగా ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి మొదట్నుంచి సరైన అప్‌డేట్లు ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. ఫ్యాన్స్‌ తరచూ గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా సస్పెన్స్ తో చంపేస్తుంది యూనిట్. ఇక రిలీజ్‌కి టైమ్ దగ్గరపడుతున్నా, ప్రమోషన్స్ కార్యక్రమాలుస్టార్ట్ చేయకపోవడంతో మరోసారి అసహనం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్. `స్టార్ట్ ఆదిపురుష్‌ ప్రమోషన్స్`(#StartAdipurushPromotions) అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో దర్శకుడు రౌత్‌ని ఆడుకుంటున్నారు. `వేక్ ఆప్‌ రౌత్‌`(నిద్ర లే రౌత్‌)అంటూ ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారడం విశేషం. మరి ఇప్పటికైనా రౌత్‌ మేల్కొని అప్‌డేట్లు ఇస్తారా? ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా? లేదా ? మళ్లీ వాయిదా వేస్తారా? అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు