మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో సందడి మొత్తం కొత్త కోడలిదే! బాగా కలిసిపోయినట్లుందే!

Published : Mar 19, 2023, 08:09 PM ISTUpdated : Mar 19, 2023, 09:06 PM IST
మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో సందడి మొత్తం కొత్త కోడలిదే! బాగా కలిసిపోయినట్లుందే!

సారాంశం

నటుడు మోహన్ బాబు జన్మదినం నేడు. ఆయన బర్త్ డే వేడుకల ఫోటోలు బయటకు వచ్చాయి. కొత్త కోడలు మోనిక రెడ్డి ఈ కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించినట్లు తెలుస్తుంది. 

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు జన్మదినం నేడు. 1952 మార్చి 19న జన్మించిన ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. విలన్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మోహన్ బాబు స్టార్ హీరో స్థాయికి ఎదిగారుల సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో క్యారెక్టర్, కామెడీ రోల్స్ సైతం చేశారు. 500 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి కళామతల్లికి సేవ చేశారు. మంచు మోహన్ బాబు జన్మదినం నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో కొత్త కోడలు మౌనిక రెడ్డి అన్నీ తానై వ్యవహరించినట్లు తెలుస్తుంది. మామయ్య మోహన్ బాబు బర్త్ డే ఈవెంట్లో ఆమె పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి,కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు మిస్. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

కాగా మనోజ్ మార్చి 3న భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. మనోజ్, మౌనికలకు తమ తమ భాగస్వాములతో విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న వీరి మధ్య అనుబంధం చిగురించింది. అది ప్రేమకు దారి తీసింది. మంచు మోహన్ బాబుకి భూమా ఫ్యామిలీతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే మౌనిక, మనోజ్ లకు పరిచయం ఉంది. మౌనిక వివాహానికి మనోజ్ హాజరు కావడం విశేషం. 

మౌనికతో మనోజ్ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. మోహన్ బాబు, విష్ణు వేడుకలకు దూరంగా ఉన్నారు. మంచు లక్ష్మి ముందుండి మనోజ్ వివాహం చేసింది. ఈ క్రమంలో పుకార్లు నిజమే అన్న వాదన వినిపించింది. మనోజ్ పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సతీసమేతంగా ఆశీర్వదించారు. మంచు విష్ణు మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. మోహన్ బాబు జన్మదినం వేళ కోడలితో మోహన్ బాబు సంతోషంగా కనిపించారు. దీంతో మనస్పర్థలు పక్కన పెట్టి కలిసిపోయారనే మాట వినిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?