Nani HIT-3: ప్రభాస్‌ కోసం కథ సెట్‌ చేస్తున్న హీరో నాని.. పాన్‌ఇండియా హిట్‌ రెడీ!

Bala Raju Telika | Published : Apr 23, 2025 11:59 PM

Nani HIT-3: హీరో నాని హిట్‌-3 ప్రమోషన్స్‌లో బిజి అయ్యారు. వరుసపెటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తను తర్వాత చేయబోయే సినిమాలతోపాటు ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ వివరాలేంటంటే.. 

నాని హీరోగా తెరకెక్కిన హిట్‌-3 సినిమా మే 1న విడుదలవుతోంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక నాని ప్రమోషన్స్‌ సంగతి తెలిసిందేగా ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. హిట్‌-3 సినిమాలో నాని రూత్‌లెస్‌ కాప్‌గా నటిస్తున్నాడు. సినిమాలో వైలెన్స్‌ అధికంగా ఉందని ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. 

హిట్‌-3 సినిమాలో వైలెన్స్‌ గురించి ప్రస్తావించిన నాని.. అదే ఉద్దేశ పూర్వకంగా పెట్టింది కాదని కథతోపాటు ట్రావెల్‌ అవుతుందని అన్నారు. సినిమా చూసిన తర్వాత ఇందులో వైలెన్స్‌ ఉందా అన్నట్లు ఆడియన్స్‌ ఫీలవుతారని అన్నారు. కానీ పిల్లలు, వైలెన్స్‌ పడని మహిళలు తన సినిమాకు రావొద్దని ముందే చెప్పేశాడు నాని. వాస్తవానికి తన సినిమాకు ఫ్యామిలీతో రావాలని అందరి హీరోలు చెబుతుంటారు. కానీ నాని వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తి.. నిజయాతీగా ఉంటుంటాడు.. దీంతో తన సినిమాకు చిన్న పిల్లలు రావొద్దని చెప్పేశాడు. ఇలా చెప్పడంపై దీనిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 

నాని తన సినిమా గురించి మాట్లాడుతూ.. తను తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి చెప్పేశాడు. దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో 'ది ప్యారడైజ్‌' అనే సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. షూటింగ్‌ మే 2 నుంచి ప్రారంభమవుతుందట. 12వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ పాల్గొంటున్నట్లు నాని చెప్పేశాడు. సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందని అన్నారు. ఆ తర్వాత సుజిత్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. 

హీరో ప్రభాస్‌తో సినిమా నిర్మించాలని అనుకుంటున్నట్లు నాని చెప్పడం సంచలనంగా మారింది. అయితే.. రెండు మూడేళ్లలో మంచి కథతో ప్రభాస్‌ అన్నతో సినిమా తీస్తానని నాని అంటున్నాడు. మంచి కథ, ప్రభాస్‌ స్కేల్‌ తగ్గట్లు దొరికితే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానన్నాడు నాని. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. నాని కథ సెలెక్ట్ చేస్తే దానికి తిరుగుండదు. ఇటీవల తను నిర్మాతగా వచ్చిన కోర్టు సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. మరి ప్రభాస్‌ కోసం నాని కథ సెలెక్ట్‌ చేసే అది ఏ రేంజ్‌లో ఉంటుందో మీరే ఊహించుకోండి. 
 

Read more Articles on
click me!