కేరళా కోసం ప్రభాస్‌ భారీ సాయం.. అస్సలు ఊహించరు..

ప్రభాస్‌ ఏం చేసినా చాలా పెద్దగా చేస్తారు. ఫుడ్‌ పెట్టినా అలానే ఉంటుంది, సహాయం చేసినా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు కేరళా కోసం ఆయన భారీ విరాళాన్ని ప్రకటించడం విశేషం. 
 


కేరళా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా వయనాద్‌ ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పటికీ ఈ విషాదం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వందల మంది ప్రజలు వరదలు కొట్టుకుపోయారు. ఊర్లకు ఊర్లే మునిగిపోవడం అత్యంత విషాదకరం. వందల్లో మృతులు ఉంటారని తెలుస్తుంది. వేలల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళా ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతుంది. 

అదే సమయంలో కేరళా కోసం నిలబడుతున్నారు సెలబ్రిటీలు. ప్రధానంగా సినీ ప్రముఖులు కేరళాకి సహాయాలు అందిస్తున్నారు. తమవంతు ఆర్థిక సాయాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి కోటీ రూపాయలు,  అల్లు అర్జున్‌ 25లక్షలు, రష్మిక మందన్నా పది లక్షలు, నిర్మాత నాగవంశీ ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ కూడా కొంత విరాళాన్ని అందించింది. 

Latest Videos

ఈ నేపథ్యంలో ఇప్పుడు డార్లింగ్‌ ప్రభాస్‌ స్పందించారు. ఆయన భారీ సహాయాన్ని ప్రకటించారు. ఏకంగా రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం విశేషం. ప్రభాస్‌ ఏది చేసినా చాలా పెద్దగా చేస్తారు. సాయం కూడా పెద్దగానే ఉంటుందనేలా ఆయన రెండు కోట్లు ఆర్థికసాయాన్ని ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని ఆయన పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. అంతేకాదు వయనాడ్‌ త్వరగా కోలుకోవాలని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన వెల్లడించారు. జరిగిన ఘటనపై ప్రభాస్‌ విచారం వ్యక్తం చేశారు. 

మరోవైపు కేరళా కోసం ఇతర భాషల సెలబ్రిటీలు కూడా స్పందించారు. సూర్య, కార్తి, జ్యోతిక కలిసి యాభై లక్షలు అందించారు. విక్రమ్‌ 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక మాలీవుడ్‌ స్టార్స్ మమ్ముట్టి, దుల్కర్‌, మోహన్‌లాల్‌, వంటి మలయాళ తారలు కూడా కేరళ కోసం తమవంతు సాయాన్ని ప్రకటించారు. 
 

click me!