ఎన్టీఆర్ హీరోగా రూపొందిన `దేవర` చిత్రం నుంచి తాజాగా రెండో పాట విడుదలైంది. ఓ వైపు రొమాంటిక్ లుక్ లో ఎన్టీఆర్ రెచ్చిపోగా, మరోవైపు ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.
ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `దేవర` నుంచి వరుసగా అప్‌డేట్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు టీమ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. గతంలో `దేవర` థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా ఉన్న ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు
సెకండ్ సింగిల్‌ని విడుదల చేసింది టీమ్.
`చుట్టమల్లే` అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్‌ని ఈ సాయంత్రం(సోమవారం) విడుదల చేశారు. ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి రాయగా, శిల్పా రావు ఆలపించారు. బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఇది. ఆద్యంతం అలరించేలా ఉంది. ఇందులో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్‌ల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, కెమిస్ట్రీ కట్టిపడేస్తున్నాయి.
సముద్రంలో, బీచ్‌లో ఈ పాటని చిత్రీకరించారు. కాస్త ఫారెస్ట్ లొకేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ టూమచ్ రొమాంటిక్‌గా ఉంది. ఆమె వాటర్‌లో తేలుతూ ఇచ్చిన పోజులు, ఎన్టీఆర్‌ని రెచ్చగొట్టేలా ఆమె వేసిన మూమెంట్స్, ఎక్స్ పోజింగ్, విరహంతో కూడిన హవాభావాలు, దానికి ఎన్టీఆర్ రియాక్ట్ అయిన తీరు టూ రొమాంటిక్‌గా ఉంది. కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉంది. దీంతో ఇప్పుడీ సాంగ్ వైరల్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ పాటని ఒకేసమయంలో విడుదల చేశారు. అన్నింట్లో గంటలోనే ఐదు మిలియన్స్ వ్యూస్‌ని సాధించడం విశేషం.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చాలా రొమాంటిక్ సాంగ్స్ చేశారు. మెలోడీస్ చేశాడు. కానీ ఇప్పుడూ ఇంత రొమాంటిక్‌గా కనిపించింది లేదు. జాన్వీ కపూర్ అందాల విందుకి, తారక్ రొమాంటిక్ స్టెప్పులు మతిపోయేలా ఉన్నాయి. ఆయన అభిమానులకు మంచి ఫీస్ట్ లా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జాన్వీ కపూర్ గ్లామర్ షో విషయంలో తగ్గడం లేదు. ఇప్పుడు `దేవర`లో మరింతగా రెచ్చిపోయింది. అమ్మ అతిలోక సుందరి శ్రీదేవీని తలపించేలా ఆమె గ్లామర్ ట్రీట్ ఇవ్వడం విశేషం. మొత్తంగా ఈ పాట గ్లామర్ వైజ్‌గా, మెలోడీ పరంగా ఆకట్టుకుంటుంది. అందరు ఆడియెన్స్ కి మంచి ట్రీట్‌లా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే దీనిపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. పాట మ్యూజిక్ ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. పాడిన విధానం, మ్యూజిక్ కాపీలా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఏకంగా రిఫరెన్స్ లు కూడా పెడుతున్నారు. ఓ ఇంగ్లీష్ పాటకి సంబంధించిన వీడియో క్లిప్‌ని షేర్ చేస్తూ, అనిరుథ్ కాపీ కొట్టాడు అని, సేమ్ టూ సేమ్ లేపేశాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో ఇది మరో రచ్చ అవుతుంది. మరి దీనిపై అనిరుథ్ స్పందిస్తారా? అనేది చూడాలి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుంది. ఈ మూవీని కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు.
As it isundi Copy 🤣😭 pic.twitter.com/6ZLB74L97P
— AitheyEnti (@Tweetagnito)