అంబానీ పెళ్లి సందడిలో ప్రభాస్.. స్పెషల్ ఎట్రాక్షన్!

Published : Dec 09, 2018, 05:00 PM IST
అంబానీ పెళ్లి సందడిలో ప్రభాస్.. స్పెషల్ ఎట్రాక్షన్!

సారాంశం

ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ మెన్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక ఆకాశాన్ని తాకేసింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ - ఆనంద్ పిరమాళ్ పెళ్లి తేదీ 12 కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ అంబానీ సారూ ముందుగానే ఊహించని గెస్టులతో అందరి మతి పోగెట్టేశాడు. 

ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ మెన్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక ఆకాశాన్ని తాకేసింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ - ఆనంద్ పిరమాళ్ పెళ్లి తేదీ 12 కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ అంబానీ సారూ ముందుగానే ఊహించని గెస్టులతో అందరి మతి పోగెట్టేశాడు. దాదాపు బాలీవుడ్ స్టార్స్ అంతా నిన్నే ఉదయపూర్ లో అడుగుపెట్టేశారు. 

ఉదయపూర్ విమానాశ్రయం మొత్తం సెలబ్రెటీలతో కళకళలాడింది. ఇక వేడుకలో ప్రభాస్ కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. దేశంలో ఉన్న ప్రముఖులంతా వేడుకలో భాగం కానున్నారు. సౌత్ నుంచి ప్రభాస్ కి స్పెషల్ గా అంబానీ ఇన్విటేషన్ పంపడం సో స్పెషల్ అని చెప్పాలి. రీసెంట్ గా కరణ్ జోహార్ తో ఇంటర్వ్యూ ను ముగించుకొని అటు నుంచి అటు సింపుల్ గా వేడుకలో పాల్గొన్నాడు. 

సాధారణంగా ప్రభాస్ కి చాలా సిగ్గు. ఎక్కడికి వెళ్లడు. అలాంటిది అంబానీ నుంచి ఇన్విటేషన్ రాగానే పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి స్పెషల్ గా పిలిచినా సిక్కుపడితే లాభం ఉండదని బయలుదేరాడు. అక్కడ ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రభాస్ ను చూసి ఫోటో దిగేందుకు కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం. 

మొత్తానికి బాహుబలి సినిమాతో ఇండియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అని అందరిని ఎట్రాక్ట్ చేశాడని అంబానీ వివాహవేడుకతో మరింత క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక నెక్స్ట్ సాహో సినిమాతో ఇంకా ఏ స్థాయిలో రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?