తన సీతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్‌..ఏమన్నాడంటే?

Published : Jul 27, 2021, 05:32 PM IST
తన సీతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్‌..ఏమన్నాడంటే?

సారాంశం

మంగళవారం కృతి సనన్‌ పుట్టిన రోజు. ఆమె తన 31వ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపారు ప్రభాస్‌, అండ్‌ `ఆదిపురుష్‌` టీమ్‌. ప్రభాస్‌ తన సీతకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

తన వెండితెర సీతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్‌. తాను రాముడిగా, కృతి సనన్‌ సీతగా `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుందీ సినిమా. 

నేడు(జులై27) మంగళవారం కృతి సనన్‌ పుట్టిన రోజు. ఆమె తన 31వ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపారు ప్రభాస్‌, అండ్‌ `ఆదిపురుష్‌` టీమ్‌. ప్రభాస్‌ తన సీతకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కృతి సనన్‌ హాట్‌ ఫోటోని పంచుకుంటూ బర్త్ విషెస్‌ తెలిపారు. `ఆదిపురుష్‌`కి మీరు చేసేది చాలా విలువైనదని తెలిపారు. 

మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ చెబుతూ, కృతి సనన్‌తో సెట్‌లో సరదాగా కూర్చొని ఫన్నీ డిస్కషన్‌ ఫోటోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఈ పిక్‌ సైతం హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు కృతికి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. కృతి తెలుగులో మహేష్‌ సరసన `వన్‌ నేనొక్కడినే` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌ కమ్‌ బ్యాక్‌ కాబోతుంది. 

ఈ సినిమాలో సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఇది తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం కృతి నటించిన `మిమి` సినిమా సోమవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికి మంచి టాక్‌ రావడం, ఆ వెంటనే తన బర్త్ డే కావడంతో కృతి ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. దీంతోపాటు `హమ్‌ దో హమారే దో`, `బచ్చన్‌ పాండే`, `భేడియా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది కృతి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్