పవన్‌- రానా మూవీ మేకింగ్‌ వీడియో గూస్‌బమ్స్.. రిలీజ్‌పై క్లారిటీ..తగ్గేదెలే అంటోన్న భీమ్లా నాయక్‌

Published : Jul 27, 2021, 04:27 PM ISTUpdated : Jul 27, 2021, 04:35 PM IST
పవన్‌- రానా మూవీ మేకింగ్‌ వీడియో గూస్‌బమ్స్.. రిలీజ్‌పై క్లారిటీ..తగ్గేదెలే అంటోన్న భీమ్లా నాయక్‌

సారాంశం

తాజాగా ఈ చిత్ర మేకింగ్‌ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవన్‌ షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత రానా, త్రివిక్రమ్‌ షూటింగ్‌లో పాల్గొనడం ఆకట్టుకుంటున్నాయి. 

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. సాగర్‌ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్‌ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. షూటింగ్‌ సెట్‌లో పవన్‌ పాల్గొన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర మేకింగ్‌ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవన్‌ షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత రానా, త్రివిక్రమ్‌ షూటింగ్‌లో పాల్గొనడం, త్రివిక్రమ్‌ పవన్‌కి సన్నివేశాలు వివరించడం, చివరికి పవన్‌ పోలీస్‌ డ్రెస్‌లో తన దైన స్టయిల్‌లో పవర్‌ఫుల్‌ వాక్‌ చేయడం ఆకట్టుకుంది. ఇందులో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రానా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. పవర్‌ స్టార్‌ హైలైట్‌గా ఈ మేకింగ్‌ వీడియో సాగింది. ఫినిషింగ్‌ టచ్‌ కూడా పవన్‌తోనే ఉండటం విశేషం. భీమ్లా నాయక్‌ రిపోర్టింగ్‌ సంక్రాంతి అనే రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇందులో ఒరిజినల్‌లోని బీజు మీనన్‌ పాత్రని పవన్‌ చేస్తుండగా,పృథ్వీరాజ్‌ పాత్రని రానా చేస్తున్నారు. ఆ సినిమాలు బీజు మీనన్‌ ఎస్‌ఐ అయ్యప్ప నాయర్‌గా నటించారు. దాన్ని ఇందులో భీమ్లా నాయక్‌గా మార్చారు. మరి రానా పాత్రకి ఏం పేరు పెడతారనేది ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పవన్‌పోలీస్‌గా నటించడం ఇది నాల్గొసారి. గతంలో ఆయన `గబ్బర్‌సింగ్‌`, `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`, `పులి` చిత్రాల్లో పోలీస్‌ పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్