Prabhas: పుట్టిన రోజున ఫ్యాన్స్ కు ప్రభాస్ డబుల్ ట్రీట్

By Surya PrakashFirst Published Oct 16, 2022, 12:49 PM IST
Highlights

ప్రభాస్ పుట్టిన రోజు నాడు అనగా అక్టోబర్ 23 వ తారీకు సలార్, ఆది పురుష్ సినిమాలకు సంబంధించి ఒకేసారి డబుల్ ధమాకా అప్ డేట్ ఇవ్వటనికి సినిమా యూనిట్లు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23ని జరుపుకోవటానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున సిద్ధం అవుతున్నారు.    బిల్లా మూవీ రీరిలీజ్ కి సన్నద్ధం చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు బిల్లా చిత్ర 4కే ప్రింట్ రెడీ చేశారు . యూవీ క్రియేషన్స్ దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. బిల్లా మూవీ 4కే క్వాలిటీతో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో బిల్లా మూవీ ప్రదర్శనలు జరగనున్నాయి. బిల్లా రీరిలీజ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు బ్రేక్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ ప్లాన్స్  చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ 43వ ఏట అడుగుపెడుతున్నారు. ఇక పెదనాన్న కృష్ణం రాజు ఇటీవల మరణించగా ప్రభాస్ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం కలదు.

అయితే ప్రభాస్ తన అభిమానులను నిరాశ పరచకుండా ఆ రోజున రెండు అప్డేట్స్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం సలార్ నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేయనున్నారు. అయితే పోస్టర్ తో సరిపెడతారని కొందరు అంటున్నారు. మరో ప్రక్క ఆదిపురుష్ చిత్రంలోని ఓ పాటను పుట్టిన రోజున రిలీజ్ చేసి, అఫీషియల్ గా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలెట్టబోతున్నారని వినికిడి.  త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. మరో ప్రక్క నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కె చిత్రానికి సంభందించి ఓ సర్పైజ్ ఉండబోతోందని అంటున్నారు. ఆదిపురుష్, సలార్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ తో కూడిన వీడియో,పోస్టర్స్ మాత్రం ఖచ్చితంగా రానున్నాయి. ఆ రోజు మామూలుగా ఉండదని అంటున్నారు.

ఇక 2023 సంవత్సరం ప్రభాస్ అభిమానుల కి ప్రత్యేకం కానుంది. ప్రభాస్ నుండి వచ్చే ఏడాది రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుంది. ఇక సమ్మర్ కానుకగా సలార్  కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలపై భారీ  ప్రేక్షకులకు అంచనాలున్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నారు. ఇక సలార్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో హైప్ మామూలుగా లేదు.

click me!