NBK107 Title: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. టైటిల్‌ అనౌన్స్ మెంట్ డేట్‌ ఫిక్స్

Published : Oct 16, 2022, 12:34 PM IST
NBK107 Title: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. టైటిల్‌ అనౌన్స్ మెంట్ డేట్‌ ఫిక్స్

సారాంశం

బాలకృష్ణ నటిస్తున్న `ఎన్బీకే 107` సినిమా టైటిల్‌ విషయంలో నెలకొన్న సస్పెన్స్ కి తెరదించబోతుంది యూనిట్‌. టైటిల్‌ అనౌన్స్ మెంట్ కి డేట్‌ని ఫిక్స్ చేసింది. 

`అఖండ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలకృష్ణ హీరోగా `ఎన్బీకే107` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు టైటిల్‌ ప్రకటించలేదు. టైటిల్‌ ఎప్పుడెప్పుడు అని నందమూరి అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. 

చాలా రోజులుగా ఈ సినిమా టైటిల్ వార్తలు ఊరిస్తున్నాయి. ఆ టైటిల్‌, ఈ టైటిల్‌ అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా `రెడ్డిగారు`, `వీర నరసింహారెడ్డి` పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. మరి వీటిలో ఏ పేరుని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది యూనిట్. టైటిల్ అనౌన్స్ మెంట్‌ డేట్‌ని ప్రకటించింది.  

దీపావళి పండగని ముందుగానే తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ నెల(అక్టోబర్‌) 21న టైటిల్‌ని ప్రకటించబోతున్నట్టు యూనిట్‌ తాజాగా వెల్లడించింది. టైటిల్‌ అదిరిపోయేలా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందట. ఈ సినిమాకి సంబంధించిన చాలా టైటిల్స్ హల్‌ చల్‌ చేస్తున్న నేపథ్యంలో అసలు టైటిల్‌ ఏంటో ఈ నెల 21న వెల్లడిస్తామని తెలిపింది యూనిట్‌. 

ఇందులో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. ఈ సినిమాని గోపీచంద్‌ అద్భుతంగా మలిచారని, అభిమానుల అంచనాలను మించి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్ లకు మంచి స్పందన లభించింది. ఇక సినిమాని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి