Happy Birthday Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సలార్ నుండి సర్ప్రైజింగ్ లుక్స్!

Published : Oct 23, 2022, 06:34 PM IST
Happy Birthday Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సలార్ నుండి సర్ప్రైజింగ్ లుక్స్!

సారాంశం

సలార్ టీం ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్స్ అందించారు.. పోస్టర్స్ కి భిన్నంగా సెట్స్ లో తీసిన స్టిల్స్ విడుదల చేశారు. ఊర మాస్ గెటప్ లో ప్రభాస్ కేకపుట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   


ప్రభాస్ బర్త్ డే నేడు. నెల రోజులుగా ఫ్యాన్స్ ఈ రోజు కోసం ఎదురు చేస్తున్నారు. ప్రభాస్ 43వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు  రాష్ట్రాలతో పాటు యూఎస్ లో బిల్లా చిత్రాన్ని రికార్డు థియేటర్స్ లో రీరీలీజ్ చేశారు. అలాగే మరికొన్ని థియేటర్స్ లో రెబల్ ప్రదర్శిస్తున్నారు. రెబల్, బిల్లా ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. 

ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రాల నుండి అప్డేట్స్ వచ్చాయి. ప్రాజెక్ట్ కే యూనిట్ ప్రభాస్ ప్రీ లుక్ విడుదల చేశారు. కవచాలతో కూడిన ప్రభాస్ పిడికిలి పోస్టర్ గా విడుదల చేశారు. పోస్టర్ లో ఒక పవర్ ఫుల్ కొటేషన్ మనం చూడవచ్చు. అలాగే ఆదిపురుష్ నుండి రామునిగా ప్రభాస్ మరో లుక్ విడుదల చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎట్టకేలకు సలార్ టీం నుండి సర్పైజింగ్ బర్త్ డే గిఫ్ట్స్ వచ్చాయి. 

భిన్నంగా పోస్టర్స్ కాకుండా సలార్ సెట్స్ లోని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. సలార్ యూనిట్ విడుదల చేసిన స్టిల్స్ లో ప్రభాస్ మాస్ లుక్  కేకపుట్టిస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు చేసి భారతీయ సినిమాకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చి అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ కి బర్త్ డే విషెష్ అంటూ సలార్ నిర్మాతలు ట్వీట్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీపై భారీ అంచనాలున్నాయి. 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కలవు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ