అల్లు అర్జున్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు

By Surya Prakash  |  First Published Oct 18, 2021, 6:51 PM IST

 అల్లు అర్జున్ "ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య" అని చెప్పడంతో పాటు "మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రమ్ తగ్గేదే లే" అంటూ డైలాగ్ చెప్పడం అందరి దృష్టీ పడింది. 


అల్లు అర్జున్ ఓ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కు అంబాసిడర్ గా మారుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ట్రోలింగ్ కు దారి తీసింది. ఇలా ఓ స్టార్ హీరో ఓ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారటం తొలిసారి.  ఈ మేరకు వచ్చి పేపర్ యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐఐటీ ర్యాంకర్స్ ప్రక్కన పోజ్ ఇస్తూ అల్లు అర్జన్ నిలబడ్డారు. ఆల్ ఇండియా ఐఐటీ నెంబర్ వన్ ర్యాంక్ అనేది పైన రాసి ఉంది. దాంతో ఆయన ఇలా చేయటం చాలా మంది ఫన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ నటుడుగా  ఎంత బిజీగా ఉన్నా ,ఈ వయస్సులో ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ రావటం అన్నది మామూలు విషయం కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. 

1986 లో విజయవాడలో  బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ మారారు బన్నీ. దీనికి సంబంధించిన యాడ్ ను విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న శ్రీచైతన్య వారు  దసరా సందర్భంగా విడుదల చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ "ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య" అని చెప్పడంతో పాటు "మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రమ్ తగ్గేదే లే" అంటూ డైలాగ్ చెప్పడం అందరి దృష్టీ పడింది. 

Latest Videos

Also read `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా ఐకాన్‌ స్టార్‌
 
ఇక టాలీవుడ్ లోని స్టార్ హీరో లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో బన్నీ కూడా ఒకరు. యూత్ లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీ అటు సినిమాలతో మాత్రమే కాక ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్ లతో సైతం బిజీ ఇపోయారు. అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ముందు క్యూ కడుతున్న తరుణంలో శ్రీ చైతన్య విద్య సంస్థలు అల్లు అర్జున్  మీద కన్నేశారు.  ఈ నేపథ్యంలోనే  టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసాడు బన్నీ. 

Also read Unstoppable talk show: బాలయ్యకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన అల్లు అరవింద్

ప్రస్తుతం అల్లు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప''. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత బన్నీ సుక్కు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతోంది.  మలయాళంలో స్టార్ హీరో  ఈ సినిమాలో విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తిరుగుతూ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
 

click me!