విజయ్ దేవరకొండకే దడ పుట్టించిన కథ, గౌతమ్ తిన్ననూరి మూవీ ప్రకటన.. చరణ్ వద్దన్నదేనా..

Published : Jan 13, 2023, 08:27 PM IST
విజయ్ దేవరకొండకే దడ పుట్టించిన కథ, గౌతమ్ తిన్ననూరి మూవీ ప్రకటన.. చరణ్ వద్దన్నదేనా..

సారాంశం

తాజాగా విజయ్ దేవరకొండ మరో మూవీ ప్రకటించారు. జెర్సీ చిత్రంతో అందరినీ ఆకర్షించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది.  

రౌడీ హీరో విజయ్ దేవరకొండకి గత ఏడాది ఎలాంటి షాక్ తగిలిందో తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం అంచనాలు అందుకోలేక చతికలబడింది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

తాజాగా విజయ్ దేవరకొండ మరో మూవీ ప్రకటించారు. జెర్సీ చిత్రంతో అందరినీ ఆకర్షించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబినేషన్  గురించి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. విజయ్ దేవరకొండ నటించబోతున్న 12వ (VD12) చిత్రం ఇది. 

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'జెర్సీ' చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది.

గౌతమ్, విజయ్ దేవరకొండ చిత్ర ప్రకటన సందర్భంగా అద్భుతమైన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ సినిమాపై ఉత్కంఠని పెంచేస్తోంది. ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ లో ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. సముద్ర తీరంలో పడవలు కాలిపోతున్నట్లు భారీ యాక్షన్ సెటప్ కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ ఫై 'నేను ఎవరికీ ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు - యనానిమస్ స్పై ' అని ఆంగ్లంలో రాసి ఉంది. 

దీనిని బట్టి ఈ చిత్రం ఎమోషనల్ స్పై థ్రిల్లర్ అని నెటిజన్లు గెస్ చేస్తున్నారు. వాస్తవానికి గౌతమ్ తిన్ననూరి రాంచరణ్ తో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్ట్ పూర్తిగా నచ్చకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు గౌతమ్ అదే కథతో విజయ్ దేవరకొండతో చిత్రం చేస్తున్నారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నేను దీనిని విన్నప్పుడు కొన్ని క్షణాల పాటు నా హృదయం ఆగిపోయింది' అని కామెంట్ పెట్టాడు. స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉండిఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?