మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్.. సలార్ 2 కాదు, ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే ఇది సలార్ 2 కాదు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్  ఉండబోయే బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం అది. 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచింది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న హిట్ దక్కింది. 

ఇక ఈ ఏడాది మరో భారీ చిత్రంతో ప్రభాస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మేలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో కమల్ హాసన్, అమితాబ్, దీపికా లాంటి స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Latest Videos

మరోవైపు ప్రభాస్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే ఫన్నీ చిత్రం కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉంటూ కూడా ప్రభాస్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సలార్ 1 ఆల్రెడీ వచ్చేసింది. ఇక సలార్ 2 రావాల్సి ఉంది. 

సలార్ ప్రాజెక్టు పక్కన పెడితే మరోసారి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ సెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రావణం అనే చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి భారీగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవసరం అవుతాయట. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ కూడా అవసరం కానున్నట్లు టాక్. ప్రభాస్ తో రావణం సెట్ అయితే ప్రశాంత్ నీల్ కమిటై ఉన్న ఇతర చిత్రాల పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రభాస్, ప్రశాంత్ నీల్ మరోసారి చేతులు కలుపుతున్నారు అంటూ బాక్సాఫీస్ బ్లాస్టింగ్ అనే చెప్పాలి. 

click me!