పూనమ్ పాండేను గుర్తించిన కేంద్రం..? ప్రచారకర్తగా నియమించిందా..?

By Mahesh JujjuriFirst Published Feb 8, 2024, 1:04 PM IST
Highlights

క్యాన్సర్ తో చనిపోయినట్టు నటించిన పూనమ్ పాండే ను.. కేంద్ర ప్రభుత్వం గురించిందా..? క్యాన్సర్ అవేర్ నెస్  ప్రోగ్రామ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందా..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత..? 
 

సర్వైకల్‌ క్యాన్సర్‌ తో చనిపోయినట్లు నటించి..  సోషల్‌ మీడియాతో పాటు ఆడియన్స్ ను ఫూల్స్ ను చేసింది బాలీవుడ్ నటి మోడల్ పూనమ్ పాండే. సర్వికల్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసమే ఇలా చేశానంటూ.. వివరణ కూడా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ. కాని ఆమె చేసిన పనికి నెట్టింట విమర్షల వాన కురిసింది. దారుణంగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. కొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలుచున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్ పూనమ్ పాండేకు.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మద్దతు ప్రకటించారు. 

అయితే ఇంత గందరగోళం సృష్టించిన పూనమ్ పాండే విషయం ఇలా నడుస్తుండగానే.. ఆమె గురించిన మరో విషయం బయటకు వచ్చింది. అదేంటంటే. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్త గా పూనమ్‌ పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు వైరల్ అయ్యాయి.  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర  ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలను కేంద్రం  ఖండించింది. 

Latest Videos

సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పూనమ్‌ పాండే పేరు పరిశీలనలో లేదని వెల్లడించింది. నటిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం కాని.. ఆ ఆలోచన కాని  లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  బుధవారం స్పష్టం చేసింది. అయితే సర్వికల్ క్యాన్సర్ తో పూనమ్‌ చనిపోయిందని అంతా భావించారు. సోషల్ మీడియాలో సంతాపంగా పోస్టులు కూడా పెట్టారు.  అదే టైమ్ లో ఆమె మృతిపై చాలా మంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. అసలే కాంట్రవర్షియల్ హీరోయిన్ కదా.. ఈసారి కూడా ఇలాంటిదేదో చేస్తోంది అంటూ విమర్షించినవారు లేకపోలేదు. 

వారు అనుకున్నట్టే .. అనూహ్యంగా ఆమె చనిపోలేదు. స్యయంగా సోషల్ మీడియా పేజ్ లోకివచ్చిన ఆమె ఈవిధంగా చెప్పింది. ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ  వీడియో రిలీజ్‌ చేసింది. సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

click me!