
గత కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించటానికి, ప్రాజెక్టు సెట్ చేయటానికి చాలా ప్రయత్నం చేసారు. ప్రభాస్ తో సినిమా చెయ్యాలనేది మైత్రీ మూవీస్ చాలా కాలంగా చేస్తన్న ఆలోచన. సిద్దార్ద్ ఆనంద్ కూడా ఈ ప్రాజెక్టుకు మ్రొగ్గు చూపారు. అయితే పఠాన్ రిలీజ్ తర్వాత మొత్తం మారిపోయినట్లు సమాచారం.
ఎందుకంటే సిద్దార్ ఆనంద్ కు పఠాన్ సూపర్ హిట్ తో ఓ రేంజిలో డిమాండ్ పెరిగిపోయింది. ఈక్రమంలో హృతిక్ రోషన్, దీపికా పదుకోని తో ఫైఠర్ అనే చిత్రం ఎనౌన్స్ చేసారు. ఆ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో ఉంటుందని అందరూ భావించారు. అయితే సిద్దార్ద్ ఆనంద్ ఇప్పుడు టైగర్ VS పఠాన్ చిత్రం సైన్ చేసారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరినీ ఈ సినిమాలో పోటా పోటిగా చూపబోతున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ ప్రాజెక్టుని భారి ఎత్తున నిర్మించనుంది. జనవరి 2014లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. స్క్రిప్టు ఇప్పటికే లాక్ అయ్యినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే 2014 మొత్తం ఈ సినిమాకే సరిపోతుంది. అంటే 2015 దాకా ప్రభాస్ తో చేయటానికి సిద్దార్ద్ ఆనంద్ కు ఖాళీ ఉండదు.
ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల షెడ్యూల్ మరింత ప్యాక్ గా ఉంది. వరస ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సూపర్ హీరో కథాంశంతో ప్రభాస్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు దర్శకుడు మారుతి - ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నది. వీటితో పాటు అర్జున్ రెడ్డి డైరక్టర్ తో స్పిరిట్ చిత్రం ఉంది. ఇవన్నీ చూస్తూంటే ఇప్పుడిప్పుడే వీరి కాంబినేషన్ మొదలు కాదు. అంటే ఈ కాంబినేషన్ సెట్ కావటానికి చాలా టైమ్ పట్టే అవకాసం ఉందంటున్నారు. అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టు క్రింద లెక్కే.