'ఏక్తా టైగర్' క్లైమాక్స్ లో యంగ్ టైగర్, క్యారక్టర్ ఏంటంటే...

Published : Apr 06, 2023, 01:06 PM ISTUpdated : Apr 06, 2023, 08:49 PM IST
 'ఏక్తా టైగర్' క్లైమాక్స్ లో యంగ్ టైగర్, క్యారక్టర్ ఏంటంటే...

సారాంశం

ఆల్రెడీ టైగర్ – 3 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.  అయితే ఏక్తా టైగర్ 3 లో ఎన్టీఆర్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఎక్కడ విన్నా  మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “సినీమాటిక్ యూనివర్స్” అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ చూసాం.  ఈ టిపికల్ స్టైల్ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తమిళ్ లో ఈ విధంగా వచ్చిన విక్రమ్, హిందీలో పఠాన్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. విక్రమ్ సినిమాలో ఖైదీని లింక్ చేయగా.. పఠాన్ లో టైగర్ సల్మాన్ ని లింక్ చేశారు. అలాగే అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, రణ్ వేర్ సింగ్ కాప్ యూనివర్స్ క్రియేట్ చేశారు. 

కాగా బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ కూడా ఇటీవల తమ సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపారు. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఈ యూనివర్స్ లో వచ్చే తదుపరి ప్రాజెక్ట్స్ ని అధికారికంగా అనౌన్స్ చేసింది. టైగర్ – 3, వార్ -2, టైగర్ v/s పఠాన్.. అనే మూడు ప్రాజెక్ట్స్ ని ప్రకటించారు. ఆల్రెడీ టైగర్ – 3 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.  అయితే ఏక్తా టైగర్ 3 లో ఎన్టీఆర్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ఏక్తా టైగర్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా పెద్ద హిట్ అయ్యింది.  ఆ తర్వాత  ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన  టైగర్ జిందాహై సినిమా కూడా మంచి విజయం సాధించింది. తొలి భాగంలో సల్మాన్ భారత రా ఏజెంట్ గా, కత్రినా పాకిస్తాన్ ఐఎస్ ఐ ఏజెంట్ గా నటించారు. సీక్వల్ లో వారి పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పార్ట్ కు రంగం సిద్దమవుతోంది. ఈ మూడో పార్ట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చివర్లో వస్తుందని...ఎన్టీఆర్ ని స్పై గా రిక్రూట్ చేసుకుంటారట.

మనీష్ శర్మ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ క్లైమాక్స్ సీన్ ఉంటుందని, అక్కడే తారక్ ని ఇంట్రడ్యూస్ చేస్తారని వినికిడి. ఆ తర్వాత ఇండియా స్పైల గ్యాంగ్ లో ఎన్టీఆర్ ని తీసుకుంటున్నట్లు చూపుతారని తెలుస్తోంది. ఆ తర్వాత దాన్ని వార్ 2 లో కంటిన్యూ చేస్తారట. అలాగే ఈ చిత్రంలో సెకండ్ పార్ట్ కు మించి యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయని తెలుస్తోంది.  ఈ సారి కథ మొత్తం యాక్షన్ కు సంబంధించిన సీన్స్ తోనే డిజైన్ చేయటం జరిగిందంటున్నారు. అందులోనూ సౌత్ మార్కెట్ కోసం ఎన్టీఆర్ ని తీసుకుంటారనే వార్త రావటంతో  సినిమా మీద అంచానలు భారీగా పెరిగిపోతున్నాయి. గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో టైగర్ జిందాహై 3 తో బిగ్ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు సల్లూ భాయ్. 

 ఇక వార్ ఫస్ట్ పార్ట్ ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు
Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది