80 ఏళ్ళు వచ్చినా షారుఖ్ తో రొమాన్స్ కు రెడీ.. హీరోయిన్ రాణీ ముఖర్జీ కామెంట్స్ వైరల్..

Published : Apr 06, 2023, 11:54 AM IST
80 ఏళ్ళు వచ్చినా షారుఖ్ తో రొమాన్స్ కు రెడీ.. హీరోయిన్ రాణీ ముఖర్జీ  కామెంట్స్ వైరల్..

సారాంశం

షారుఖ్ ఖాన్ తో ఇప్పటికీ రొమాంన్స్ చేయడానికి రెడీ అంటుంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. అంతే కాదు 80 ఏళ్లు వచ్చినా.. షారుఖ్ తో సినిమా అంటే.. పరిగెడతానంటోంది.   

బాలీవుడ్  సినిమాల్లో మంచి పెయిర్ గా పేరుతెచ్చుకన్నారు షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ. ఈజంట స్క్రీన్ మీద కనిపిస్తే.. విజిల్స్.. అరుపులు కేకలే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వీరు. ఇక రాణీముఖర్జీ ప్రస్తుతం విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అవ్వగా.. షారుఖ్ మాత్రం ఇంకా కుర్రాడిలా మెరిసిపోతున్నాడు.. 60 ఇయర్స్ కు దగ్గరలో ఉన్నా.. సిక్స్ ప్యాక్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్నారు. 

ఇక  షారుఖ్ ఖాన్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ కలిసి గతంలో చాలానే సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్ లో కుచ్ కుచ్ హోతా హై, చల్తే చల్తే, పహేలీ, కభీ అల్విదా నా కెహ్నా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. షారుఖ్, రాణి ముఖర్జీ మధ్య మొదటి నుంచీ మంచి స్నేహం ఉంది.రీసెంట్ గా  రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే ఓ సినిమాలో నటించింది. ఈమూవీ  రిలీజ్ అయ్యి మంచి సక్సెసె సాధించింది. దాంతో రాణీ ముఖర్జీతో పాటు..మూవీ టీమ్ అంతంటిని  అభినందిస్తూ.. షారుఖ్ ట్వీట్ కూడా చేశాడు. 

ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో రాణి ముఖర్జీ షారుఖ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింద రాణీ మేడమ్.  మీడియా ప్రతినిథులు షారుఖ్ ఖాన్ గురించి  అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాణీ ముఖర్జీ. రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. నేను రైటర్స్ కి ఇప్పుడే చెప్తున్నాను, మంచి లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ నాకు, షారుఖ్ కి రాయండి. మేమిద్దరం కలిసి చేస్తాం. షారుఖ్ తో యంగ్ లో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా నటించడం అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే.. నాకు 80 ఏళ్ళు వచ్చినా కూడా షారుఖ్ తో  రొమాన్స్ చేయడానికి, లవ్ స్టోరీలు చేయడానికి నేను రెడీనే.. అని చెప్పింది రాణీ. 

ఇక ఈ కామెంట్స్ బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్, రాణి ముఖర్జీ అభిమానులు అయితే.. వీరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని తెగ ఆరాటపడుతున్నారు.  మరి అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి