రాజా డీలక్స్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్, మారుతితో సినిమా ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Published : Jul 23, 2022, 03:35 PM IST
రాజా డీలక్స్ కోసం  రెడీ అవుతున్న ప్రభాస్, మారుతితో సినిమా ఓపెనింగ్ ఎప్పుడంటే..?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మీద ఉన్నాడు. దీపం ఉండగానే సినిమాలు చక్కదిద్దుకుంటున్నాడు యూనివర్సల్ హీరో. ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న హీరో.. రాజా డీలక్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడట.   

బాహుబలి తరువాత ప్రభాస్  అన్నీ భారీ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ తో ప్రభాస్ సినిమాలు సాగిపోతున్నాయి. ప్రస్తుతం 5 భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ ఫుల్ బిజీ బజీగా ఉన్నాడు. అందులో మూడు సినిమాల షూటిగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. రెండు సినిమాలు టైటిల్స్ తో సహా అనౌన్స్ చేసి రెడీగా ఉన్నాడు ప్రభాస్. 

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ను తన స్టోరీలైన్ తో కట్టిపడేశాడు మారుతి. ప్రభాస్ను దర్శకుడు మారుతి ఒప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అంతే కాదు ఈసినిమాకు రాజా డీలక్స్ టైటిల్ అంటూ న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది. అయితే మరో షాకింగ్ న్యూస్ఏంటీ అంటే.. ప్రస్తుతం భారీ బడ్జెట్ లో  ప్రభాస్ సినిమాలు చేస్తున్నా... మారుతితో చేసే సినిమా మాత్రం ఆయన  స్థాయిలోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

బడ్జెట్ పరంగా మారుతి సినిమాల రేంజ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. అలాగే ఈ సినిమాను కూడా ఆయన డిజైన్ చేశాడు. ఈ కథ అంతా కూడా రాజా డీలక్స్ అనే ఒక సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుందని టాక్ . హారర్ టచ్ తో సాగే మారుతి మార్క్ కామెడీ సినిమా ఇది. అలాగని చెప్పేసి ప్రభాస్ స్థాయిని తగ్గించే ఆలోచనగానీ .. అవకాశంగాని లేని సినిమా ఇది అంటూ ప్రాచారం సాగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్