నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి సాలిడ్ వీడియో సాంగ్.. ‘అదిరిందే’ అదిరిందిగా..

Published : Jul 23, 2022, 02:26 PM IST
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి సాలిడ్ వీడియో సాంగ్.. ‘అదిరిందే’ అదిరిందిగా..

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ - కృతి శెట్టి   కలిసి నటిస్తున్న తాజా  చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా సాలిడ్ మీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్  చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా ‘రంగ్ దే’, ‘మ్యాస్ట్రో’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మాస్ అండ్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితిన్ -  కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మూవీకి ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హిట్ కొట్టాలనే సాలిడ్ కంటెంట్ తో మాస్  లుక్ తో నితిన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన ఐటెం సాంగ్ ‘రా రా రెడ్డి’ ఇంకా ట్రెండింగ్ లోనే ఉండగా.. చిత్ర యూనిట్ మరో రొమాంటిక్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ‘అదిరిందే’ (Adirindey) టైటిల్ తో లేటెస్ట్ సాంగ్ యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సాంగ్ కు క్రిష్ణ కాంత్ ( కేకే) లిరిక్స్ అందించగా..  సింగర్ సంజిత్ హెగ్దే అద్బుతంగా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ మహాతి స్వర సాగర్ క్యాచీ ట్యూన్ అందించారు. లిరిక్స్ హార్ట్ టచ్చింగ్ ఉన్నాయి. సంగీత ప్రియులు ఈ సాంగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది గంటల్లోనే దాదాపు ఆరు లక్షల్లో వ్యూస్ ను దక్కించుకుందీ మెలోడీ.

రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రపు ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. అదిరిపోయే అప్డేట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. మూవీని నితిన్ సొంత ప్రొడక్షన్  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పైనే నిర్మిస్తుండటం విశేషం. నిర్మాతలుగా సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి లు  వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్లుగా  కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగష్టు 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?