డైనోసార్ నుంచి డార్లింగ్ గా మారిపోతున్న ప్రభాస్..మారుతి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Dec 29, 2023, 09:49 AM IST
డైనోసార్ నుంచి డార్లింగ్ గా మారిపోతున్న ప్రభాస్..మారుతి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

డైనోసార్ తరహాలోనే ప్రభాస్ శత్రువులని చిత్తు చిత్తు చేశాడు. ఇక డైనోసార్ అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైనది. ఈ డైనోసార్ ని క్రేజీ డైరెక్టర్ మారుతి పూర్తిగా డార్లింగ్ గా మార్చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ప్రస్తుతం థియేటర్స్ లో విధ్వంసం సృష్టిస్తోంది. దాదాపు 500 కోట్ల గ్రాస్ సాధించిన సలార్ మూవీ మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా సత్తా తెలిసేలా చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా ఎంటర్టైన్ చేసిన చిత్రం ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ కి డైనోసార్ అంటూ క్రేజీ ఎలివేషన్ దక్కింది. 

డైనోసార్ తరహాలోనే ప్రభాస్ శత్రువులని చిత్తు చిత్తు చేశాడు. ఇక డైనోసార్ అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైనది. ఈ డైనోసార్ ని క్రేజీ డైరెక్టర్ మారుతి పూర్తిగా డార్లింగ్ గా మార్చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. 

ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి భారీ యాక్షన్ చిత్రాల గ్యాప్ లో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక మీడియం రేంజ్ ఎంటర్టైన్మెంట్ మూవీలో నటిస్తున్నాడు. చాపకింద నీరులా ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది. సలార్ హంగామా కాస్త చల్లారడంతో తమ చిత్ర ఫస్ట్ లుక్ కి మారుతి ముహూర్తం ఫిక్స్ చేసారు. సంక్రాంతిలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. 

డైనోసార్ ని మనందరం కోరుకునే డార్లింగ్ లాగా చూస్తారని ఈ అనౌన్సమెంట్ లో తెలిపారు. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తోంది. గతంలో ఈ చిత్ర టైటిల్ రాజా డీలక్స్ అంటూ ప్రచారం జరిగింది. మరి మారుతి అండ్ టీమ్ ఎలాంటి టైటిల్ కి ఫిక్స్ అయ్యారో.. ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారో తెలియాలంటే పొంగల్ వరకు ఎదురుచూడాలి. 

ఈ చిత్రంలో మారుతి ప్రభాస్ కామెడీ టైమింగ్ ని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ జోవియల్ గా, రొమాంటిక్ గా కనిపించి చాలా కాలమే అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?