#KotabommaliPS ఓటిటి రిలీజ్ డేట్

By Surya PrakashFirst Published Dec 29, 2023, 8:13 AM IST
Highlights

నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమా న్యూఇయర్ కానుకగా ఫస్ట్ వీకెండ్‏లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.


మళయాలం బ్లాక్ బస్టర్ నాయట్టు రైట్స్ తీసుకొన్న గీతా ఆర్ట్స్ 2 దాన్ని అనేైక  కారణాల వల్ల తీయటం ఆలస్యం చేస్తూ వచ్చింది.  మొదట ఓ డైరక్టర్ , టీమ్ తో అనుకుని తర్వాత వద్దనుకుని వాళ్లని మొత్తం మార్చేసి, వేరే దర్శకుడు టీమ్ తో ఈ సినిమాని   ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. లింగిడి లింగిడి పాట బాగా వైరల్ కావడంతో ఇదో సినిమా ఉందని జనాలకు తెలిసింది కానీ..స్టార్ క్యాస్టింగ్ లేకపోవటంతో పెద్దగా ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. అదే విధంగా ఎంత కాంట్రవర్శీ చేద్దామని ప్రయత్నించినా జనాలను రప్పించలేకపోయారు.  జోహార్ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన ఈ కాప్ డ్రామా బాగుందని అనిపించుకున్నా టార్గెట్ ప్రేక్షకులను రీచ్ అవటంతో ఫెయిల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్  కు రెడీ అవుతోంది. 

నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమా న్యూఇయర్ కానుకగా ఫస్ట్ వీకెండ్‏లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే.. మీడియా వర్గాల్లో  వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట.త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Latest Videos

చిత్రం కథేమిటంటే...టెక్కలి నియోజకవర్గంలో బై ఎలక్షన్ల సందడి నడుస్తున్న సమయంలో ఆ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంటాడు హోమ్ మంత్రి(మురళీశర్మ). అదే నియోజకవర్గంలోని కోట బొమ్మాళి పీఎస్‌ లో రామకృష్ణ (శ్రీకాంత్‌) హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. అతను కూంబింగ్ ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్ కూడా. అదే స్టేషన్‌లో కుమారి (శివానీ రాజశేఖర్‌), రవి కుమార్‌(రాహుల్‌ విజయ్‌) కానిస్టేబుల్స్ గా పని చేస్తుంటారు. అంతా సాఫీగా జరిగిపోతున్న సమయంలో ఒక పొలిటికల్ లీడర్ కారణంగా ఈ పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓ రోజు రాత్రి పార్టీకి వెళ్లి వస్తుండగా రామకృష్ణ, రవి, కుమారి ప్రయాణిస్తున్న పోలీస్‌ జీపు ఓ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి (విష్ణు) మరణిస్తాడు. అతడి మరణానికి కారణమైన పోలీస్‌లను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌ పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ ‘నాయాట్టు’ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇంటర్వెల్‌ వరకు సినిమా పరుగులు పెడుతుంది. సెకండాఫ్‌ కాస్త బోర్ కొడుతుంది.
 

click me!