షూటింగ్ స్పాట్ లో డార్లింగ్ తో రచ్చ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ గా ప్రభాస్, జాక్వెలిన్ ఫన్నీ వీడియో.!

Published : Dec 01, 2022, 06:02 PM ISTUpdated : Dec 01, 2022, 06:03 PM IST
షూటింగ్ స్పాట్ లో డార్లింగ్ తో రచ్చ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ గా ప్రభాస్, జాక్వెలిన్ ఫన్నీ వీడియో.!

సారాంశం

డార్లింగ్ ప్రభాస్ - సుజీత్ కాంబోలో వచ్చిన యాక్సన్ ఫిల్మ్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ లో నటించింది. మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ తో జాక్వెలిన్ చేసిన హంగామాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.  

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అద్భుతమైన విజువల్స్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తాను చాటింది. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ (Saaho)లో నటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ చిత్రం అన్నీ  వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది. యాక్షన్ పరంగా మాత్రం నెక్ట్స్ లెవల్ అనిపించింది. 

అయితే, ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాహో చిత్రంలోని ‘బ్యాడ్ బాయ్’ సాంగ్  ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది.  ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) నటించింది. ఈ సందర్భంగా షూట్ గ్యాప్ లో మినీ వ్లాగ్ క్రియేట్ చేస్తూ షూటింగ్ స్పాట్ లో రచ్చ చేసింది. తన అభిమానులకు ప్రభాస్ ను ‘బ్యాడ్ బాయ్’గా పరిచయం చేస్తూ సందడి చేసింది. డార్లింగ్ ప్రభాస్ కూడా స్టైలిష్ లుక్ లో జాక్వెలిన్ ప్రశ్నలకు ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చేరి తెగ వైరల్ అవుతోంది. 

చివరిగా ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. అంతగా ఆకట్టుకోలేకపోయారు.దీంతో తదుపరి చిత్రాలైన ‘ఆదిపురుష్’,‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది మిడిల్ ఈయర్ లో ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సలార్, ప్రాజెక్ట్ కే ఒకదాని వెంట మరోటి థియేటర్లలో దుమ్ములేపనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలపై భారీ హైప్ నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్