రాఘవేంద్రరావుపై అదిరిపోయే పంచ్ వేసిన అరవింద్

Published : Dec 01, 2022, 04:42 PM IST
 రాఘవేంద్రరావుపై అదిరిపోయే పంచ్ వేసిన అరవింద్

సారాంశం

 ఇదే టాపిక్  అన్ స్టాపబుల్ 2...ఐదవ ఎపిసోడ్ లోనూ వచ్చింది . నందమూరి తారక రామారావు శతదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ నలుగురు లెజెండ్స్ ను కొత్త ఎపిసోడ్ కు పిలిచాడు. ఈ మేరకు ప్రోమో వదిలారు.  


తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్  డైరెక్టర్స్ లో కె. రాఘవేంద్రరావు బిఎ ఒకరు.  ఆయన మీద ఒకే ఒక కంప్లైంట్ లేదా పొగడ్త. అదేమిటంటే రాఘవేంద్రరావు సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్లు, పూలు, పండ్లు, బొడ్డు, యాపిల్.. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది.  అవి లేనిదే అది రాఘవేంద్రరావు సినిమానే అనిపించుకోదు. ఇదే టాపిక్  అన్ స్టాపబుల్ 2...ఐదవ ఎపిసోడ్ లోనూ వచ్చింది . నందమూరి తారక రామారావు శతదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ నలుగురు లెజెండ్స్ ను కొత్త ఎపిసోడ్ కు పిలిచాడు. ఈ మేరకు ప్రోమో వదిలారు.

ఈ ఎపిసోడ్ లో నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, డైరెక్టర్ రాఘవేంద్రరావు తో సందడి చేసారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.   రాఘవేంద్రరావు వస్తూనే సురేష్ బాబు, అల్లు అరవింద్ లకు పంచ్ వేసారు. “40 ఏళ్లుగా వీరిద్దరి మధ్య సాండ్ విచ్ లా మారాను. ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్యనేనా” అంటూ కౌంటర్ వేశారు. 

ఇక అల్లు అరవింద్ సైతం రాఘవేంద్రరావు పై జోకులు వేశారు. “రాఘవేంద్రరావు బిఎ అంటే ఏంటో తెలుసా.. రాఘవేంద్రరావు బొడ్డు మీద యాపిల్”అంటూ చమత్కరించారు. న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను అంటూ రాఘవేంద్రరావు చెప్పి ఆ నేమ్ కు జస్టిఫై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?