ఆదిపురుష్ నుంచి నెక్ట్స్ అప్ డేట్ కి రెడీ అవుతున్న మేకర్స్.. ఎప్పుడంటే..?

Published : Apr 25, 2023, 01:38 PM IST
ఆదిపురుష్ నుంచి నెక్ట్స్ అప్ డేట్ కి రెడీ అవుతున్న మేకర్స్.. ఎప్పుడంటే..?

సారాంశం

అనుకున్న విధంగా ఆదిపురుష్ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు టీమ్. ఇక తాజాగా మరో అప్ డేట్ కు రెడీ అవుతున్నారు ఆదిపురుష్ మేకర్స్.   


ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణ బ్రహ్మగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈమూవీకోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.  ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా, ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఆదిపురుష్.. పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది.  రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, ఈ సినిమా నుండి శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తాం అన్నారు మేకర్స్ . అన్నట్టుగానే అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. వరుస అప్డేట్స్‌తో మూవీ టీమ్ అభిమానుల్లో ఈ సినిమాపై  అంచనాలను రెట్టింపు చేస్తోంది. 

అయితే, ఈ సినిమా నుండి ఇప్పుడు మరో సాలిడ్ హింట్ ను రిలీజ్ చేయడానికి  మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సరికొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ నుంచి హిట్స్ వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా నుండి సరికొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీపై నెగెటీవ్ టాక్ ఉంది. టీజర్ తో అది ఇంకా పెరిగింది. ప్రభాస్ తో రాముడి అవతారం అద్భుతంగా చూపిస్తాడు అనుకుంటే.. ఏదో బొమ్మలాట చేసి వదిలిపెట్టాడు అంటూ విమర్షలు వచ్చాయి. దాంతో ఈసారి గ్రాఫిక్స్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి సినిమా అయినా.. అభిమానులు మెచ్చేలా తీస్తారా లేదా అనేది చూడాలి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?