న్యూడ్ గా షాకిచ్చిన పాయల్.. ‘మంగళవారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

By Asianet News  |  First Published Apr 25, 2023, 11:57 AM IST

‘ఆర్ ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి నెక్ట్స్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్ పూత్ హీరోయిన్. కాగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది.
 


టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) తాజాగా నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. 'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) డైరెక్ట్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత అజయ్ తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, 'A' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. దీంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. 

పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే Mangalavaaram టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. ఇక తాజాగా పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పాయల్ ఈ చిత్రంలో శైలజాగా అలరించబోతోంది.  అయతే పోస్టర్ మాత్రం షాకింగ్ గా ఉంది. RX100తోనే బోల్డ్ నెస్ తో మతులు పోగొట్టిన పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రం అంతకుమించి పెర్ఫామ్ చేయబోతుందని అర్థం అవుతోంది. 

Latest Videos

ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ ఒంటిపై నూలు పోగు కూడా లేదు. బ్యాక్ నుంచి న్యూడ్ గా దర్శనమిచ్చింది.  జడలో మల్లెపూలు, చేతి వేలిపై వాలిన సీతాకోక చిలుక, పాయల్ చూపు, కొత్త లుక్ కూడా ఆసక్తికరంగా మారింది. పోస్టర్ లో బోల్డ్ నెస్ తో పాటు ఎమోషన్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.  1990 గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది.  

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోరూపొందుతున్న చిత్రమిది. కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయిన విషయం తెలిసిందే.. తాజాగా పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ లో  సినిమా రాబోతోంది. 'మంగళవారం' టైటిల్ ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానుందని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుందన్నారు.

ఇప్పటికి 75 రోజులు షూటింగ్ చేశాం. ఎక్కువ శాతం నైట్ షూట్స్ ఉన్నాయి. వచ్చే నెలలో ఆఖరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, ఆర్ట్ : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, సినిమాటోగ్రఫీగా దాశరథి శివేంద్ర బాధ్యతలు చూస్తున్నారు.  

 

click me!