
ఆదిపురుష్ నుంచ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం వరుస అప్ డేట్స్ ఇస్తామంటూ మాట ఇచ్చారు మూవీ టీమ్. అనుకున్నట్టుగానే శ్రీరామనవమికి.. ప్రభాస్ సీతారాముల లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా హనుమాన్ జయంతి సంద్భంగా.. హనుమాన్ స్పషల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఆదిపురుష్ టీమ్.ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. దీంతో పాటే ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023 రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీత పాత్రలో.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న ఈసినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాధేశ్యామ్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ను చూడలేదు ప్యాన్స్. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ని రాముడిగా ఎలా చూపిస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఎవరికి వారు.. ప్రభాస్ ను రాముడిగా ఇలా ఉంటాడు.. అలా ఉంటాడు అని గొప్పగా ఊహించుకున్నారు.
అయితే ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా నిరాశపరిచింది. రాముడిగా ప్రభాస్ ను ఆరడుగుల ఆజానుభాహుడిగా చూపిస్తాడు అనుకుంటే.. ఏదో కార్టూన్ సినిమా మాదిరిగా ఉంది అంటూ.. టీజర్ పూ పెదవివిరిచారు అభిమానులు. దాంతో ఒం రౌత్ టీమ్ టెన్షన్ లో పడిపోయింది. ఈ విషయంలో ప్రభాస్ కూడా కాస్త కోపంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రామాయణం తీస్తాడు అనుకుంటే.. ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి.
అలాఅయినా రామాయణం తీస్తారు అనుకుంటే.. అసలు గెటప్ లు.. కట్టు బొట్టు అంతా మార్చేసి.. టీజర్ తోనేసినిమాను నీరుగార్చాడు ఓం. దాంతో సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. ఇక ఇలా అన్ని వైపుల నుంచి ఆదిపురుష్ పై ట్రోల్స్ గట్టిగా వస్తున్నాయి. మరి ఈ విషయంలో దర్శకుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాడో చూడాలి.