జై శ్రీరామ్ అంటూ.. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, మరోసారి రిలీజ్ డేట్ కన్ ఫార్మ్ చేసిన టీమ్,

Published : Apr 22, 2023, 09:12 AM ISTUpdated : Apr 22, 2023, 09:15 AM IST
జై శ్రీరామ్ అంటూ.. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, మరోసారి రిలీజ్ డేట్ కన్ ఫార్మ్ చేసిన టీమ్,

సారాంశం

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ముందుగా చెప్పిన విధంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు ఆదిపురుష్ టీమ్. తాజాగా ఈమూవీ నంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. జై శ్రీరామ్ అంటూ సాగే పాట.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

రామాయణం ఆధారంగా తెరుకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.  రాముడిగా యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈసినిమా .. దేశవ్యాప్తంగా అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే ఆదిపురుషక్ మూవీపై నెగెటీవ్ ఆలోచనలతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆక్రమంలోనే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్స్.. అండ్  టీజర్ ప్రేక్షకులకు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై దర్శకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ఆదిపురుష్.. రిలీజ్ ముస్తాబవుతుంది. తాన్హాజి మూవీ ఫేమ్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈసినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాని అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాడు దర్శకుడు. రామాయణం చూపిస్తారు అనుకుంటే.. బొమ్మలాట చూపించారంటూ.. ఇప్పటికే సినిమా టీమ్ పై భారీగా విమర్షలు వచ్చాయి. దాంతో  వీఎఫ్ఎక్స్ మార్చే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు టీమ్. శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తాము అని ప్రకటించారు దర్శకుడు. అనుకున్నట్టుగానే ఒకటి తరువాత మరొక అప్ డేన్ ఇస్తున్నారు. ఈక్రమంలో ఈరోజు ఆదిపురుష్ మూవీ నుంచి  ఫస్ట్ సింగిల్ కు సబంధించిన చిన్న బిట్ ను  రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్ తెలుగు బిట్ రిలీజ్ చేసి..  సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  నీ సాయం.. సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్య.. మా బలమేదంటే నీపై నమ్మకమే.. జైశ్రీరాం.. జైశ్రీరాం. అంటూ పాట ఆకట్టుకుంటుంది. 

రామ భక్తులు మెచ్చేసా..సాదారణ ప్రేక్షకులు కూడా ఇష్టపడి వినేలా అద్భుతంగా ట్యూన్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అజయ్.. అతుల్ సంగీతం బాగుందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈసినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రభాస్ ప్యాన్స్ ఆగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమాతో పాటు.. సలార్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.. మరో రెండు సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్