ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ సర్ ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ డైరెక్టర్, ఆగిఫ్ట్ ఏంటంటే..?

Published : Jul 16, 2022, 02:00 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ సర్ ప్రైజ్  ఇచ్చిన ఆదిపురుష్ డైరెక్టర్, ఆగిఫ్ట్ ఏంటంటే..?

సారాంశం

ప్రభాస్ ఫ్యాన్స్ కోసం బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్ చేశాడు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్. యంగ్ రెబల్ స్టార్ లవర్స్ అదిరిపడేలా సినిమానకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఈపనిమీద తాను అమెరాకాలోని లాస్ ఏజిల్ కు వెళ్లాడు.   

స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ వెయిట్ చేయడం సహజం. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం దేశవ్యాప్తంగా జనాలు ఎదురు చూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను థియేటర్ స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ప్రభాస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు నిరాశపరిచే సరికి... ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. 

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి కాబట్టి ప్రభాస్‌ సినిమాలు సహజంగానే విడుదలకు ఆలస్యమవుతుంటాయి. దీంతో కనీసం సినిమాల నుంచి అప్ డేట్స్ అయినా ఇవ్వండంటూ.. ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తరుచూ చిత్ర దర్శక నిర్మాతలను అడుగుతుంటారు. ఇక ఆల్ ఇండియాన ప్రభాస్ ఫ్యాన్స్ కోసం భారీ అప్ డేట్ ను ఇచ్చారు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌.

 

ఆది పురుష్ సినిమాను  త్రీడీ ఫార్మేట్‌లోకి మారుస్తున్నారన్న న్యూస్ ను రివిల్ చేశారు దర్శకుడు. ప్రస్తుతం. అమెరికాలోని లాస్‌ఎంజెలీస్‌ ఐమాక్స్‌లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఓం రావత్‌ తన ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఆదిపురుష్‌ పనులు పూర్తి దశకు వచ్చాయి. ప్రభాస్‌  ఫ్యాన్స్ కు నేనిచ్చే పెద్ద అప్‌ డేట్‌ ఇదే. సినిమా విడుదల కోసం నేనూ వేచి చూస్తున్నా’ అన్నారు. 

అమెరికాలోని ఐమాక్స్ ముందు దిగిన ఫోటో ను షేర్ చేసుకున్నారు దర్శకుడు. టీ సిరీస్‌ సంస్థలో భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. అందులు మూడు సినిమాలు షూటింగ్ యాక్టీవ్ గా చేసుకుంటున్నాయి. ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ తో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఇక ఇవి కాకుండా నాగ్ అశ్వీన్ తో ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు ప్రభాస్. 

ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈసినిమాలతో పాటు సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాను కన్ ఫార్మ్ చేశాడు ప్రభాస్. అటు మారుతితో కూడా ఓ సినిమాను ప్లాన్ చేశాడు. ఈరెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. సైమల్టైనస్ గా సినిమాల షూటింగ్స్, షెడ్యూల్స్ ను మేనేజ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. వరుసగా రెండు సినిమాలు ప్లాప్ లు అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈసారి మాత్రం సాలిడ్ హిట్ కొట్టడానికి సై అంటున్నాడు. చూడాలి సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కేలలో ప్రభాస్ కు మళ్లీ బ్లక్ బస్టర్ ఏ సినిమా ఇస్తుందో.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే