చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్

Published : Aug 11, 2019, 06:18 PM ISTUpdated : Aug 11, 2019, 06:24 PM IST
చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్

సారాంశం

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. ఆదివారం సాయంత్రం టాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సినిమాకు సంబందించిన అనేక విషయాలపై సమాధానం ఇచ్చారు.

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. ఆదివారం సాయంత్రం టాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సినిమాకు సంబందించిన అనేక విషయాలపై సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెస్సేజ్ చూసి షాకయినట్లు చెప్పారు. 

ప్రభాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజ్ కాగానే చాలా మంది కాల్ చేశారు. బాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు కూడా మెస్సేజ్ చేశారు. నా స్నేహితులు అలాగే రాజమౌళి కూడా కాల్ చేసి బావుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చిరంజీవి గారు నాకు మెస్సేజ్ చేయగానే షాక్ అయ్యాను. ట్రైలర్ చాలా బావుందని అద్భుతంగా కనిపించవని మెగాస్టార్ గారు మెస్సేజ్ చేయగానే నేను వెంటనే కాల్ చేశాను. 

ఆయన అలా మెస్సేజ్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గూస్ బంప్స్ వచ్చాయని ప్రభాస్ మాట్లాడారు. ఇక సినిమాలో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని మెయిన్ గా యాక్షన్ సీన్స్ మునుపెన్నడు పెద్ద తెరపై చూడని విధంగా ఉంటాయని ప్రభాస్ వివరణ ఇచ్చారు. 

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్  

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?